Site icon NTV Telugu

Elon Musk : మళ్లీ ట్విట్టర్‌ను టార్గెట్‌ చేసిన ఎలాన్‌ మస్క్‌..

Elon Musk

Elon Musk

టెస్లా మరియు స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌.. మరోసారి ట్విట్టర్‌ను టార్గెట్‌ చేశారు.. ట్విట్టర్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించి.. ఆ తర్వాత డీల్‌ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే, ఆ డీల్‌ను ప్రతిపాదించిన నాటి నుంచీ.. ట్విట్టర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.. అదే డీల్‌ రద్దు వరకు వెళ్లింది.. అయితే, సమయం దొరికిన ప్రతీసారి అన్నట్టుగా ట్విట్టర్‌పై తన కోపాన్ని వెల్లగక్కుతూనే ఉన్నారు మస్క్.. తాజాగా మరోసారి సోషల్‌ మీడియా దిగ్గజాన్ని టార్గెట్‌ చేశారు.. ట్విట్టర్‌లో 20 శాతం ఖాతాలు ఫేకేఅంటూ ఆరోపిస్తూ వచ్చిన ఆయన.. ఇప్పుడు.. తాను చేసే ట్వీట్లపై వచ్చే కామెంట్లలో 90 శాతం ఫేక్‌ ఖాతాల నుంచే అని ఆరోపణలు గుప్పించారు.

Read Also: Bhagyanagar Ganesh Utsav Samithi: దీక్ష విరమించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి భగవంత్‌రావు

క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజీ సంస్థ బైనాన్స్‌ సీఈవో చాంగ్‌పెంగ్‌ ఝావో పేరుతో వచ్చిన రిప్లై కూడా నకిలీదే అని పేర్కొన్నారు ఎలాన్ మస్క్‌.. దానిని స్క్రీన్‌షాట్‌ తీసి షేర్‌ చేశారు.. మరియు నా ట్విట్టకు వచ్చే కామెంట్లలో 90 శాతం ఫేక్‌ అని రాసుకొచ్చాడు.. ఈ పోస్ట్‌తో, మస్క్ ట్విట్టర్ యొక్క మొత్తం వినియోగదారులలో సుమారు 20 శాతం మంది మోసపూరితమైనవారని తన మునుపటి వాదనను పునరుద్ఘాటించాడు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు పరాగ్ అగర్వాల్ యొక్క ప్లాట్‌ఫారమ్‌పై ఈ నెల ప్రారంభంలో మస్క్ దాడి చేసిన విషయం తెలిసిందే.. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎఫ్‌5లో గ్లోబల్ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డాన్ వుడ్స్ ప్రకారం, 80 శాతం కంటే ఎక్కువ ట్విటర్ ఖాతాలు బాట్‌లుగా ఉంటాయని పేర్కొన్నారు. ట్విట్టర్ తన వినియోగదారులలో 5 శాతం మాత్రమే బాట్‌లు లేదా స్పామ్‌లు అని పేర్కొన్నందున ఇది భారీ ఆరోపణగా చెప్పవచ్చు..

Exit mobile version