Site icon NTV Telugu

Myntra: మింత్రాకు ఝలక్ ఇచ్చిన ఈడీ.. రూ.1,654 కోట్ల విలువైన పెట్టుబడుల ఉల్లంఘనపై కేసు నమోదు..!

Myntra

Myntra

Myntra: భారత్ లో ఆన్లైన్ సేవలను అందించే మింత్రాకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఝలక్ ఇచ్చింది. ఫ్యాషన్‌, సంప్రదాయ దుస్తులకు నిలయంగా మారిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మింత్రా (Myntra) ఇప్పుడు విదేశీ పెట్టుబడుల నిబంధనలను (FDI Norms) ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించి దర్యాప్తు మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించి మొత్తం రూ.1,654 కోట్ల విలువైన పెట్టుబడుల ఉల్లంఘనపై ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (FEMA) 1999 కింద కేసు నమోదు చేసింది ఈడీ.

Mission Impossible : హాలీవుడ్ ‘మిషన్ ఇంపాజిబుల్’.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

నిజానికి మింత్రా అనేది, ఫ్లిప్‌కార్ట్ గ్రూపులో భాగంగా పనిచేస్తూ భారతీయులకు ట్రెండీ దుస్తులను అందిస్తూ మంచి బ్రాండ్‌ గా మారింది. అయితే, మింత్రా సంస్థ హోల్‌సేల్ మోడల్‌ లో వ్యాపారం చేస్తోందని తెలిపినా, నిజానికి మాత్రం రీటైల్ స్థాయిలో నేరుగా కస్టమర్లకు దుస్తులను అమ్ముతోందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ రకమైన మల్టీ బ్రాండ్ రీటైల్ ట్రేడింగ్ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. కానీ, మింత్రా ఎటువంటి అనుమతులు లేకుండానే పెట్టుబడులు తీసుకుందని అధికారులు చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు చేయగా అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మింత్రా తన ఉత్పత్తులను ఎక్కువగా వెక్టర్ ఈ-కామర్స్ అనే సంస్థకు అమ్మినట్లు గుర్తించారు. అయితే, ఈ వెక్టర్ సంస్థ మింత్రాకు చెందినదే అని అధికారులు గుర్తించారు. తర్వాత అదే వెక్టర్ సంస్థ ఆ వస్తువులను కస్టమర్లకు నేరుగా అమ్ముతోందని గుర్తించారు. ఈ విధంగా మింత్రా వ్యాపారాన్ని రెండు భాగాలుగా B2B (బిజినెస్ టు బిజినెస్), తరువాత B2C (బిజినెస్ టు కస్టమర్) గా చూపించి, అసలు రీటైల్ అమ్మకాలను హోల్‌సేల్ లావాదేవీలుగా మలచిందని ఆరోపణలు ఉన్నాయి.

Local Body Elections : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు షురూ.. కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు

అయితే, 2010లో వచ్చిన ఎఫ్డీఐ (FDI) నిబంధనల ప్రకారం, హోల్‌సేల్ వ్యాపారం చేసే సంస్థలు గరిష్ఠంగా 25% వ్యాపారమే తాము సంబంధం ఉన్న కంపెనీలకు మాత్రమే చేయాలి. కానీ, మింత్రా ఈ పరిమితిని మించి అధికంగా తనదైన వెక్టర్ సంస్థకే అమ్మకాలు జరిపిందని ఈడీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసు 2010 నుంచి 2015 మధ్యకాలంలో జరిగిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి మాత్రమే నమోదైంది. ఈ సమయంలో మింత్రాను నడిపిన స్థాపకులు ముకేష్ బాన్సల్, అశుతోష్ లావానియా వంటి వారిపై కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఈ విషయాలపై మింత్రా ప్రతినిధులు స్పందిస్తూ.. “తాము చట్టాలను గౌరవిస్తున్నాం. అధికారులకు అవసరమైనంత సహకారం అందిస్తాం” అని తెలిపారు. మొత్తంగా ఈ ఘటన దేశంలోని ఈ-కామర్స్ రంగంపై కొత్తగా నియంత్రణలు విధించే దిశగా ప్రభుత్వ దృష్టిని సారించే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు భావిస్తున్నారు.

Exit mobile version