Credit Card : క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారా? అయితే ఈ తప్పులు మాత్రం చెయ్యకండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు.. కొందరు అవసరం ఉన్నా లేకున్నా కూడా తీసుకుంటారు.. ఇక బ్యాంకులు కూడా తమ సేల్స్ పెంచుకోవడం కోసం కార్డులను జారీ చేస్తుంటారు.. అయితే క్రెడిట్ కార్డులను తీసుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం నష్టాలను చూడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎక్కువ మంది క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులను చెల్లిస్తారు.. క్రెడిట్ కార్డులతో కొన్ని మాత్రం కొనుగోలు చేస్తే రివార్డు పాయింట్స్ వస్తాయి. డైనింగ్, ట్రావెల్, కిరాణా లేదా ఇంధనం వంటి నిర్దిష్ట ఖర్చు వర్గాలకు అనుగుణంగా వివిధ రివార్డ్‌లు, ప్రయోజనాలను అందిస్తాయి. ఎక్కడ ఉపయోగిస్తే రివార్డ్స్ ఎక్కువగా వస్తాయో ముందుగా తెలుసుకోవాలి.. అక్కడ మాత్రమే కార్డులను వాడటం మంచిది..
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
అలాగే క్రెడిట్ కార్డుల బిల్లును కరెక్ట్ టైంకు చెల్లించాలి.. లేకుంటే అదనపు డబ్బులను చెల్లించాలి.. ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ అవి అధిక వార్షిక రుసుములతో రావచ్చు. వార్షిక రుసుమును చెల్లించడాన్ని సమర్థించడానికి మీ వినియోగ ఫ్రీక్వెన్సీని, ఈ ప్రయోజనాల నుంచి మీరు పొందిన విలువను పరిగణించాలి. యాన్యూవల్ ఫీ తక్కువగా ఉన్న కార్డులను మాత్రమే తీసుకోవాలి..
క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకున్నప్పుడు చాలా మంది వ్యక్తులు వడ్డీ రేట్లను పట్టించుకోరు. కేవలం రివార్డ్‌లు, ప్రయోజనాలపైనే దృష్టి పెడతారు.. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి.. లేకుంటే భారాన్ని మోయాల్సి వస్తుంది.. బలమైన భద్రతా ఫీచర్‌లతో క్రెడిట్ కార్డ్‌లను ఎంచుకోవాలి. కార్డ్ జారీచేసేవారి మోసం ను నియంత్రించే శక్తి ఉందో లేదో కనుక్కోవాలి..ఇవే కాదు ఒకేసారి వివిధ కార్డులను అస్సలు తీసుకోవడం మంచిది కాదు. అందుకే కార్డులను తీసుకొనే ముందు అన్ని తెలుసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..