గత కొన్ని సంవత్సరాలుగా.. దీపావళి, ధన్‌తేరస్‌లలో భారతీయ మార్కెట్లలో చైనా ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతోంది. ముఖ్యంగా అలంకరణ వస్తువుల విక్రయాలు గతంతో పోలిస్తే ఈ సారి గణనీయంగా తగ్గాయి. తక్కువ డిమాండ్ కారణంగా.. దిగుమతులు కూడా తగ్గుతున్నాయి. దీని కారణంగా దేశీయ వస్తువుల అమ్మకాలు పెరుగుతున్నాయి. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచార ప్రభావం ఇప్పుడు దేశంలో కనిపిస్తోంది. దేశీయ వస్తువులనే కొనుగోలు చేయాలన్న ఆయన నినాదం చైనాపై తీవ్ర ప్రభావం చూయించింది. ఈ ఏడాది దీపావళిన ముఖ్యంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ చూసిన తర్వాతే ఎలక్ట్రానిక్స్, డెకరేషన్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
READ MORE: Somy Ali: ‘‘సల్మాన్ ఖాన్ కన్నా లారెన్స్ బిష్ణోయ్ నయం’’.. స్టార్ హీరో మాజీ ప్రేయసి..
చైనా ఉత్పత్తులకు వ్యతిరేకత:
ఓ నివేదిక ప్రకారం.. దీపావళికి సంబంధించి చైనా వస్తువుల విక్రయాలు భారీగా క్షీణించడంతో చైనా దాదాపు రూ.1 లక్షా 25 వేల కోట్ల మేర నష్టాన్ని చవిచూస్తోంది. ఎందుకంటే గతంలో చైనా వస్తువుల డిమాండ్ భారీగా ఉండేది. కానీ ప్రస్తుతం వాటికి ఆదరణ కరువైంది. మట్టి దీపాలు, అలంకార వస్తువులను కుమ్మరుల నుంచి కొనుగోలు చేస్తూ.. మంచి సందేశాన్ని అందిస్తున్నారు. దీపావళికి సంబంధించిన వస్తువులను తయారు చేసే తమ ప్రాంతంలోని మహిళలు, కుమ్మరులు, చేతివృత్తులు, ఇతరులకు సహాయం చేయాలని దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలను సీఏఐటీ (CAIT) కోరింది. దీంతో ప్రజల్లో అవగాహన పెరిగి ఇప్పుడు దేశీయ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయా కార్మికుల ఇళ్లలో కూడా దీపావళి వెలుగులు నింపుతున్నారు.
READ MORE:Naga Vamsi: అందుకే లక్కీ భాస్కర్ ప్రీమియర్ షోలు.. నాగవంశీ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) ప్రకారం.. ఈ ఏడాది ధన్‌తేరస్‌పై దాదాపు రూ.60 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. దీపావళి నాటికి ఈ సంఖ్య లక్ష కోట్లు దాటుతుంది. ఈ కాలంలో బంగారం, వెండితో పాటు ఇత్తడితో చేసిన పాత్రల కొనుగోలు కూడా భారీగానే జరిగింది. ఈసారి దాదాపు రూ.2500 కోట్ల విలువైన వెండిని కొనుగోలు చేశారు. ఒక్కరోజులో రూ.20 వేల కోట్ల విలువైన బంగారం అమ్ముడుపోయింది.