NTV Telugu Site icon

Swiss Banks: స్విస్ బ్యాంకుల్లో భారీగా క్షీణించిన భారతీయ ఖాతాదారుల డిపాజిట్లు..

New Project (3)

New Project (3)

భారతీయులు, కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు 2023లో 70 శాతం తగ్గి కనిష్ట స్థాయి రూ.9,771 కోట్లకు (1.04 స్విస్ ఫ్రాంక్‌లు) చేరింది. ఈ డబ్బును స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల మొత్తం సంపద వరుసగా రెండో సంవత్సరం కూడా క్షీణించింది. ఇది 2021లో గరిష్ట స్థాయి 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరుకుంది. క్షీణతకు ప్రధాన కారణం బాండ్లు, సెక్యూరిటీలు, వివిధ ఆర్థిక సాధనాల ద్వారా నిల్వ చేయబడిన సంపద తగ్గిపోవడమని నివేదికలు చెబుతున్నాయి. అదనంగా, కస్టమర్ డిపాజిట్ ఖాతాలలో డిపాజిట్లు, భారతదేశంలోని ఇతర బ్యాంకు శాఖల ద్వారా నిర్వహించబడే నిధులు కూడా గణనీయంగా తగ్గాయి.

READ MORE: Health Crisis In Srilanka: శ్రీలంకలో ఆరోగ్య సంక్షోభం.. హస్పటల్స్కి తాళాలు

అయితే తాజాగా విడుదలైన స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షిక డేటాలో కీలక విషయాలు బయటపడ్డాయి. స్విస్‌ బ్యాంకుల్లో విదేశీ ఖాతాదారుల నిధుల నిల్వల్లో బ్రిటన్‌ అగ్రస్థానంలో ఉండగా, అమెరికా రెండో స్థానంలో ఉంది. అయితే స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో 70 శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరినట్లు ఈ డేటా చెబుతోంది. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో దాదాపు 25 శాతం పడిపోయి రూ.63 కోట్లకు చేరాయి. ఈ డిపాజిట్లు 2022లో 18 శాతం పెరగగా, 2021లో 8 శాతానికిపైగా పడిపోయాయి. 2007 చివరి నాటికి స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్ల విలువ రూ. 9,000 కోట్లతో గరిష్ఠ స్థాయికి చేరింది. స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డేటా, వ్యక్తులు,సంస్థల డిపాజిట్లు, వివిధ బ్యాంకుల్లో నిల్వలు సహా స్విస్ బ్యాంకుల్లోని భారతీయ ఖాతాదారుల అన్ని రకాల నిధులను పరిగణనలోకి తీసుకుని ఈ గణాంకాలను వెల్లడించారు. బాండ్లు, సెక్యూరిటీలు ఇలా భారతీయుల నిల్వలు భారీగా పడిపోయాయని,కస్టమర్ డిపాజిట్ ఖాతాల్లోని మొత్తం నిధులు కూడా గణనీయంగా తగ్గాయని తాజా డేటా వివరించింది. 2023లో స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నిధులు రూ.9,771 కోట్లకు పడిపోయినట్లు తెలిపింది.