NTV Telugu Site icon

Credit Card Rule: క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పు, ఏప్రిల్ 1 నుంచి న్యూ రూల్స్..!

Credit Card Ruls Chaing

Credit Card Ruls Chaing

Credit Card Rule: S బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కు సంబంధించి దేశీయ లాంజ్ యాక్సెస్ నియమం మార్చించి. ఇక నుంచి క్రెడిట్ కార్డ్ హోల్డర్లు లాంజ్‌లోకి ప్రవేశించాలంటే కనీసం 10 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. లాంజ్ యాక్సెస్ సౌకర్యాలలో ఫుడ్‌, వైఫై, ఎయిర్‌పోర్ట్ లాంజ్, షవర్, లాంజ్ ఉన్నాయి. అందుకే ఈ నిబంధన కీలకంగా మారనుంది. S బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొత్త రూల్ 1 ఏప్రిల్, 2024 నుండి అమలులోకి వస్తుంది. మీకు లాంజ్ యాక్సెస్ కావాలంటే, మీరు డిసెంబర్ 21, 2023 మరియు మార్చి 20, 2024 మధ్య నిర్ణీత మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేవలం క్రెడిట్ ఉంటే సరిపోదు.. బ్యాంకులు మీరు క్రెడిట్ కార్డ్‌తో కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తేనే ఈ సౌకర్యాలు వర్తిస్తాయని షరతు విధించింది. S బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనల మార్పుతో, Yes Marquee, Yes Select, Yes Reserve, Yes First Preferred, యెస్ బ్యాంక్ ఎలైట్ కార్డ్‌లు ప్రభావితమవుతాయి.

Read also: Ayodhya: టీటీడీ సహాయం కోరిన అయోధ్య రామమందిరం ట్రస్ట్‌.. సౌకర్యాల కల్పనకు సహకారం

మరోవైపు, ఎస్ బ్యాంక్‌లో తన వాటాను 9.5 శాతానికి పెంచుకోవడానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు ఆర్‌బిఐ అనుమతించడంతో, ఎస్ బ్యాంక్ షేర్లు 13 శాతం పెరిగాయి. ఇప్పుడు ఎస్ బ్యాంక్ షేర్ విలువ 25.70కి చేరింది. మరోవైపు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌కు సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కీలక మార్పులు చేయనుంది. ఈ మార్పులు కూడా ఏప్రిల్ 2024 నుండి అమలులోకి వస్తాయి. ICICI క్రెడిట్ కార్డ్ హోల్డర్లు చివరి త్రైమాసికంలో కనీసం 35 వేల రూపాయలు ఖర్చు చేయాలి. అంటే వచ్చే త్రైమాసికంలో విమానాశ్రయ ప్రవేశం పొందాలంటే చివరి త్రైమాసికంలో క్రెడిట్ కార్డుపై 35 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. యాక్సిస్ విస్తారా ఇన్ఫినిట్ క్రెడిట్ కార్డ్‌లో మార్పులను కూడా యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. మొదటి సంవత్సరానికి వర్తించే గోల్డ్ స్టేటస్ ప్రయోజనం రెండవ సంవత్సరానికి వర్తించదు.
Telangana Assembly: 8 రోజులు.. 45 గంటలు.. 3 బిల్లులు.. 2 తీర్మానాలు..