NTV Telugu Site icon

భార‌త్‌లో వ్యాక్సినేష‌న్.. ఐఎంఎఫ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

IMF

భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. మ‌రోవైపు మూడు వేవ్ ముప్పు పొంచిఉంద‌ని హెచ్చ‌రిస్తూనే ఉన్నారు వైద్య నిపుణులు.. ఈ ప‌రిస్థితుల్లో కోవిడ్‌ను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేష‌న్ ఒక్క‌టిఏ మార్గం.. కానీ, క‌రోనా వ్యాక్సిన్ల కొర‌త కార‌ణంగా.. వ్యాక్సినేష‌న్ చాలా రాష్ట్రాల్లో నిలిచిపోయిన ప‌రిస్థితి.. అయితే, వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాల‌న్న టార్గెట్‌తో ఉంది కేంద్రం.. ఈ నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి సంస్థ‌ (ఐఎంఎఫ్).. భార‌త్‌లో ఈ ఏడాది చివ‌రి నాటికి కేవ‌లం 35 శాతం జ‌నాభాకే వ్యాక్సినేషన్ అందుతుంద‌ని అంచ‌నా వేసింది ఐఎంఎఫ్. మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో సంప‌న్న దేశాలు మాత్రం.. త‌మ జ‌నాభాలో 50 శాతం నుంచి 70 శాతం వ‌ర‌కూ వ్యాక్సినేష‌నేష‌న్‌ను పూర్తి చేస్తాయ‌ని త‌న నివేదిక‌లో పేర్కొంది. ఇక‌, క‌రోనాపై పోరాటానికి ఈ సంవ‌త్స‌రం చివ‌రినాటికి ప్ర‌పంచ జ‌నాభాలో క‌నీసం 40 శాతం మంది జ‌నాభాకు వ్యాక్సిన్ ఇచ్చేలా 3.5 ల‌క్ష‌ల కోట్ల నిధుల‌తో ఐఎంఎఫ్ ఎక‌న‌మిస్ట్ రుచిర్ అగర్వాల్ చీఫ్ ఎక‌న‌మిస్ట్ గీతా గోపీనాథ్ లు ఓ ప్ర‌ణాళిక‌ను కూడా రూపొందించారు.. తాము అంచ‌నా వేసిన‌ట్టుగానే. వ్యాక్సిన్లు, మందులు పొంద‌డం సంప‌న్న‌, పేద దేశాల మ‌ధ్య అంత‌రాలు పెరిగాయ‌ని తెలిపింది ఐఎంఎఫ్‌. కాగా, భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ కొర‌త రాష్ట్రాల‌ను వెంటాడుతూనే ఉంది.. దీంతో.. వ్యాక్సిన్ ప్ర‌క్రియ ఆగిపోయిన ప‌రిస్థితి. మ‌రోవైపు.. వ్యాక్సిన్ల కొనుగోలుకు రాష్ట్రాలు ఆర్డ‌ర్లు ఇస్తున్నాయి.