Cooking Oil Price: సామాన్యుడికి మరో బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత భారతీయుల వంటింట్లో మంటలు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసును దెబ్బతీసింది. దీని ప్రభావంతో భారత్‌లో వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రవాణా ఖర్చులు పెరగడం ఒక కారణమైతే, ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తూ ధరలను పెంచుతున్నారు. ఫలితంగా సామాన్యుడి బడ్జెట్ తలకిందులై, నిత్యావసరాల కొనుగోలు పెను భారంగా మారింది.
గత నెల రోజుల్లోనే వంట నూనెల ధరలు సుమారు 22 శాతం మేర పెరిగాయి. వివిధ రకాల నూనెల ధరల వ్యత్యాసాన్ని పరిశీలిస్తే.. సన్ ఫ్లవర్ ఆయిల్ గతంలో రూ. 180 ఉన్న ధర ప్రస్తుతం రూ. 200లకు చేరింది. పేద ప్రజలు ఎక్కువగా వాడే పామాయిల్ నూనె ధర రూ. 120 నుంచి రూ. 145కు పెరిగింది. వేరుశనగ నూనె విషయానికి వస్తే.. లీటరుపై రూ. 15 మేర పెరుగుదల కనిపించగా, 15 కిలోల హోల్‌సేల్ టిన్ను ధర రూ. 2300 నుండి రూ. 2400కు చేరుకుంది. ఇక సోయాబీన్, రైస్ బ్రాన్, వనస్పతి, ఆవ నూనెల ధరలు కూడా లీటరుకు రూ. 15 నుంచి రూ. 30 వరకు అదనపు భారాన్ని మోపుతున్నాయి.
Also Read
- Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
సామాన్యుడిపై ప్రభావం…
కేవలం వంట నూనెలే కాకుండా, గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరగడం సామాన్యుడిని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. వాణిజ్య సిలిండర్ల ధరల పెరుగుదల వల్ల హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. అటు వంటింట్లో నూనె మంట, ఇటు గ్యాస్ భారం వెరసి మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తమవుతున్నాయి.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. కృత్రిమ కొరత సృష్టిస్తున్న నిల్వదారులపై నిఘా ఉంచడం, అక్రమ తనిఖీలు నిర్వహించడం ద్వారా ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అంతర్జాతీయ సంక్షోభం సాకుతో సామాన్యుడిని దోచుకోకుండా కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే సామాన్యుడి జేబుకు పడుతున్న చిల్లును అరికట్టవచ్చు. ప్రభుత్వం సబ్సిడీలు లేదా దిగుమతి సుంకాల్లో మార్పుల ద్వారా ధరల నియంత్రణకు చొరవ చూపాలి.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!