Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్
- పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు
- ట్రంప్ హెచ్చరికతలతో మార్కెట్ కుదేల్
- భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి ఘోరంగా పతనం అయింది. ఇటీవల కాలంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మార్కెట్ బుధవారం బ్లడ్‌బాత్ చూసింది. పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో మార్కెట్ ఒక్కసారిగా ఢమాల్ అయింది. ఇరాన్-అమెరికా పరస్పర దాడులు.. మరోవైపు ట్రంప్ హెచ్చరికలు మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. అంతర్జాతీయంగా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఉదయం నుంచి తడబడుతూ ఉన్న మార్కెట్.. మధ్యాహ్నం నుంచి భారీగా పడిపోయింది. ప్రధాన షేర్లన్నీ భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.8.50 లక్షల కోట్లు నష్టపోయారు.
ఇరాన్‌పై అమెరికా తాజా వైమానిక దాడులు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,677 పాయింట్లు నష్టపోయి 76, 503 దగ్గర ముగియగా.. నిఫ్టీ 516 పాయింట్లు నష్టపోయి 23, 882 దగ్గర ముగిసింది. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేర్లలో జియో ఫైనాన్షియల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, హిందుస్థాన్ యూనిలీవర్ న్నాయి. ఇక ఓఎన్జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో లాభాల్లో ముగిశాయి. ఈ పరిణామంతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు మళ్లీ మొదలయ్యాయి.
Also Read
- Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
- LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
- EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
ఇక విదేశీ మారక మార్కెట్లో కూడా రూపాయిపై ఒత్తిడి కొనసాగింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 58 పైసలు బలహీనపడింది. మంగళవారం ముగింపు స్థాయి 94.97 నుంచి బుధవారం డాలర్‌కు రూ.95.55 దగ్గర ముగిసింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలు రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
- Tags
- crash
- Nifty
- Sensex
- Stock Market
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!