Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Companies Making Huge Profits Are Not Ready To Increase Employee Salaries

Economic Survey 2024-25: భారీ లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు.. ఉద్యోగుల నోట్లో మట్టి!

Published Date :January 31, 2025 , 6:01 pm
By RAMAKRISHNA KENCHE
  • ఆర్థిక సర్వేను సమర్పించిన ఆర్థిక మంత్రి
  • సర్వేలో కీలక విషయాలు
  • పెరిగి కంపెనీల లాభాలు
  • ఉద్యోగులకు పెరగని జీతాలు
Economic Survey 2024-25:  భారీ లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు.. ఉద్యోగుల నోట్లో మట్టి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2024-25 ఆర్థిక సర్వేను సమర్పించారు. భారతీయ కంపెనీలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయని, అయితే తమ ఉద్యోగుల జీతాన్ని పెంచేందుకు సిద్ధంగా లేవని సర్వే పేర్కొంది. కంపెనీల లాభం, జీతాల వాటాను పరిశీలించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి.అనంత్ నాగేశ్వరన్ రూపొందించిన సర్వే తెలిపింది. శ్రమ, మూలధనం మధ్య ఆదాయ పంపిణీ ఉత్పాదకత, పోటీతత్వం, స్థిరమైన అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుందో సర్వే వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల లాభాలు 15 ఏళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అయితే ఉద్యోగుల జీతాలు అందుకు అనుగుణంగా పెరగలేదని సర్వే పేర్కొంది.

READ MORE: Donald Trump: “జన్మహక్కు పౌరసత్వం” అర్హత లేని వ్యక్తులకు, అర్హత లేని పిల్లలకు కాదు..

ఆర్థిక, ఇంధనం, ఆటోమొబైల్ రంగాలు మంచి వృద్ధి సాధించాయి. దీని కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ కంపెనీలు లాభాలను ఆశించాయి. లాభాల్లో15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 59 పెద్ద కంపెనీలు, ముఖ్యంగా నాన్-ఫైనాన్షియల్ రంగంలోని కంపెనీలు, తమ రంగంలోని చిన్న కంపెనీల కంటే మెరుగ్గా పనిచేశాయి. కంపెనీల లాభాలు పెరిగినా.. ఉద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నాయి. అంటే ఉద్యోగుల జీతాలు మాత్రం తగ్గుముఖం పట్టాయని సర్వే పేర్కొంది. కార్పొరేట్‌లో భారీ అసమానత ఏర్పడిందని సర్వే కుండ బద్దలు గొట్టింది. 2024 ఆర్థిక సంవత్సరంలో లాభాలు 22.3% పెరిగాయి.. కానీ ఉపాధి 1.5% మాత్రమే పెరిగింది. దీంతో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచే బదులు ఖర్చు తగ్గింపుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఎంట్రీ లెవల్‌లో స్తబ్దత స్పష్టంగా కనిపిస్తోంది. లాభాల్లో ఎక్కువ వాటా తీసుకోవడం, ఉద్యోగుల జీతాలు పెంచకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉంది.

READ MORE: Union Budget 2025-26: బడ్జెట్‌కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్‌లో జోరు.. కారణం ఇదే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Budget
  • Companies making huge
  • Economic Survey
  • Economic Survey 2024-25
  • employee salaries

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

  • JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

  • Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?

  • Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions