Site icon NTV Telugu

Cognizant: భారత్‌లో విక్రయానికి వచ్చిన కాగ్నిజెంట్‌ ప్రధాన కార్యాలయం..

Cog1

Cog1

Cognizant: టెక్‌ సంస్థ కాగ్నిజెంట్‌ భారత్‌లోని తన ప్రధాన కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టింది. చెన్నైలోని ఒక్కియం తొరాయ్‌పక్కంలోని ఈ బిల్డింగ్ ను దాదాపు 20 ఏళ్లుగా ఆ సంస్థ హెడ్‌ ఆఫీస్‌గా ఉపయోగిస్తుంది. ఐటీ కారిడార్‌లోని దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు లక్షల చదరపు అడుగుల ఈ కార్యాలయం విలువ కనీసం 750 – 800 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని రియల్‌ ఎస్టేట్‌ సంస్థల అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ స్థిరాస్తి సేవలందించే సంస్థ జేఎల్‌ఎల్‌కు దీని విక్రయ బాధ్యతలను అప్పగించినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఓ కథనం ప్రచురణ చేసింది.

Read Also: Sharad Pawar: జెడ్ ప్లస్ సెక్యూరిటీని నిరాకరించిన శరద్ పవార్

కాగా, ఇప్పటికే జేఎల్‌ఎల్‌ సంస్థ భాష్యం గ్రూప్‌, కాసగ్రాండ్‌ సంస్థలతో పలు దఫాల చర్చలు జరిపింది. కానీ, డీల్‌ ముందుకు సాగకపోవడంతో.. దీనిపై ఇటు కాగ్నిజెంట్‌ అటు జేఎల్‌ఎల్‌ ఎలాంటి కామెంట్స్ చేయలేదు.. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి మాత్రం సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఈ ఆఫీసును ఖాళీ చేసే అవకాశం ఉంది. జీఎస్‌టీ రోడ్డులోని తంబారం సమీపంలోని సరికొత్త ప్రధాన కార్యాలయం అప్పటికల్లా అందుబాటులోకి వస్తుందని కాగ్నిజెంట్ భావిస్తున్నారు. అయితే, కాగ్నిజెంట్‌ చెన్నై నగరంలోని తన కార్యకలాపాలను ఎంఈపీజెడ్‌, షోలింగనల్లూర్‌, సిరుసేరిలోని మూడు భవనాల్లో ఏకీకృతం చేస్తున్నట్లు తెలిపింది. ఇక్కడ డీఎల్‌ఎఫ్‌, సెయింట్‌ మేరీస్‌ రోడ్డులోని ఆఫీస్‌ లీజులను వదిలేసింది.

Exit mobile version