Site icon NTV Telugu

Business Updates: స్టాక్‌ మార్కెట్ల బిజినెస్ అప్‌డేట్లు.. కంపెనీల త్రైమాసిక ఫలితాలు..

Business Flash

Business Flash

Business Updates: స్టాక్‌ మార్కెట్‌

ఈ వారం స్టాక్‌ మార్కెట్ల శుభారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 450 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 16,200 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీలో ఐటీ, మెటల్‌ షేర్ల కొనుగోళ్లు 1 నుంచి 3 శాతం పెరిగాయి. ఎఫ్‌ఎంసీజీ, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్, రియాల్టీ స్టాక్స్‌కి కూడా ప్రాఫిట్స్‌ వచ్చాయి. బీఈఎల్‌ భారీ లాభాలు ప్రకటించటంతో ఆ కంపెనీ షేర్లు నాలుగు శాతం పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. టీసీఎస్‌, సన్ ఫార్మా, టెక్‌ మహీంద్రా, విప్రో, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ తదితర సంస్థలు ఎక్కువగా లాభపడ్డాయి.

త్రైమాసిక ఫలితాలు

లోకల్‌ సెర్చ్‌ ఫ్లాట్‌ఫాం ‘జస్ట్‌ డయల్‌’ ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గతేడాది ఫస్ట్‌ క్వార్టర్‌తో పోల్చితే ఈసారి మొత్తం నష్టం రూ.48.36 కోట్లకి పెరిగినట్లు పేర్కొంది. మరోవైపు.. టాటా ఎల్‌ఎక్స్‌సి మొదటి మూడు నెలల్లో నికర లాభం 63 శాతం పెరిగినట్లు తెలిపింది. ఈ సంస్థకు గతేడాది ఇదే సమయంలో రూ.113.8 కోట్లు మాత్రమే రాగా ఈసారి రూ.184.72 కోట్ల వరకు లాభాలను ఆర్జించింది.

సౌదీకి రష్యా నుంచి రెట్టింపు చమురు

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియా రష్యా నుంచి భారీగా చమురును దిగుమతి చేసుకుంది. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండో త్రైమాసికంలో రెట్టింపు కన్నా ఎక్కువే ఇంపోర్ట్‌ చేసుకోవటం గమనార్హం. దీంతో సౌదీ అరేబియా తన సొంత చమురును ఇక పూర్తిగా ఎగుమతులకే కేటాయించనుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవటంపై పలు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో రష్యా.. రేటు తగ్గించి మరీ సౌదీ అరేబియాకి చమురును ఎగుమతి చేస్తోంది. రాయిటర్స్‌ వెల్లడించిన డేటా ప్రకారం సౌదీ అరేబియా రష్యా నుంచి 6 లక్షల 47 వేల బ్యారెళ్ల చమురును ఇంపోర్ట్‌ చేసుకుంది. అంటే సౌదీ అరేబియా రష్యా దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి విదేశాలకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటోందన్నమాట.

more read: Business Headlines: బంగారం ధరలు మరింత పతనం.. పెరిగిన రైతుల ఆదాయం..

Exit mobile version