Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్‌ఫ్లిక్స్‌లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reed Hastings: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి వినోదాన్ని చేరువ చేసిన నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలతో ఛైర్మన్‌గా ఆయన పదవీకాలం ముగియనుండగా, ఆ తర్వాత కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి కూడా ఆయన తప్పుకోనున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు నెట్‌ఫ్లిక్స్‌ను అగ్రపథంలో నడిపిన హేస్టింగ్స్, ఇకపై ప్రజా సంక్షేమం కోసం పని చేయాలని భావిస్తున్నారు. 2023లోనే ఆయన సీఈఓ పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు బోర్డు నుంచి కూడా తప్పుకోవడంతో ఆయన తదుపరి అడుగు సామాజిక సేవా కార్యక్రమాల వైపు ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఆయన చేపట్టబోయే కొత్త ప్రాజెక్ట్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది.
READ ALSO: Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?
Also Read
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
- RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
- Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
1997లో చిన్న అడుగు..
1997లో తన స్నేహితుడు మార్క్ రాండోల్ఫ్‌తో కలిసి హేస్టింగ్స్ నెట్‌ఫ్లిక్స్‌ను ప్రారంభించారు. మొదట్లో డీవీడీ రెంట్ సర్వీస్‌గా మొదలైన ఈ సంస్థ.. నేడు 190కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ సేవలను అందిస్తోంది. “వినియోగదారుల సంతోషంపై దృష్టి పెట్టడం, ప్రతిభావంతులు ఎదిగేలా ఒక సంస్కృతిని నిర్మించడమే నెట్‌ఫ్లిక్స్‌కు నేను అందించిన నిజమైన సహకారం” అని హేస్టింగ్స్ ఈ సందర్భంగా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. భారతదేశంలో కూడా దీనికి భారీ క్రేజ్ ఉంది. మన దేశంలో ప్రకటనలతో కూడిన బేసిక్ ప్లాన్ రూ.199 కే అందుబాటులో ఉంది. వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్ మూవీస్, డాక్యుమెంటరీలతో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రంగంలో రారాజుగా వెలుగొందుతోంది.
కేబుల్ టీవీ లేదా శాటిలైట్ కనెక్షన్ అవసరం లేకుండా, నేరుగా ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లలో వీడియో కంటెంట్‌ను చూసే సదుపాయాన్ని ఓటీటీ (Over-The-Top) అంటారు. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, జీ5 వంటివి ఈ రంగంలో ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.
READ ALSO: Fish Pickle: చేపల పచ్చడి నీచు వాసన రాకుండా పర్ఫెక్ట్‌గా కుదరాలా.. అయితే సింపుల్‌గా ఇలా చేయండి!
తాజావార్తలు
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!