గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ అంటే వ్యవసాయమే.. రైతులకు సిరులు కురిపించే పంటలు కూడా కొన్ని ఉన్నాయి.. వాటితో లక్షలు సంపాదిస్తున్న రైతులు కూడా ఉన్నారు.. సంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటలు పండిస్తే మంచి లాభాలు వస్తాయి. అలాంటి వాటిలో నిమ్మగడ్డి కూడా ఒకటి. నిమ్మగడ్డి సాగుచేస్తూ.. ఎంతో మంది రైతులు లక్షలు సంపాదిస్తున్నారు..అతి తక్కువ పెట్టుబడితో కళ్ళు చెదిరె లాభాలను పొందవచ్చు… అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నిమ్మగడ్డి తో నూనెను సౌందర్య సాధనాలు, సబ్బులు, నూనెలు, అనేక ఔషధాల తయారీలో వినియోగిస్తారు. దీనికి మార్కెట్‌లో మంచి ధర రావడానికి ఇదే కారణం. నిమ్మగడ్డి సాగులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. దీనిని కరువు ప్రభావిత ప్రాంతాల్లో కూడా నాటవచ్చు. బంజరు భూమిల్లో కూడా పండించవచ్చు. నిమ్మగడ్డి సాగుతో కేవలం ఒక హెక్టారుతో ఏడాదికి దాదాపు 4 లక్షల రూపాయల లాభం పొందవచ్చు.ఈ నిమ్మగడ్డిని నాటడానికి ఫిబ్రవరి-జూలై నెలలు అనుకూలం అనే చెప్పాలి.. అప్పుడే పంటలను వేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.. ఎలానో ఇప్పుడు చూద్దాం..
ఈ పంటను ఒకసారి నాటితే ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఏడాదికి మూడు నుంచి నాలుగు సార్లు కోత కోస్తారు. గడ్డి నుంచి సువాసన వస్తుందంటే.. అది కోతకు వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఎండిన తర్వాత పొడి చేసి అమ్ముకోవచ్చు. లేదా నూనెను చేసే మిషన్స్ ను కొనుగోలు చేసి వాటితో నూనెను తయారు చెయ్యొచ్చు.. ఈ నూనెను మార్కెట్లో రూ. 1200నుంచి 1500 విక్రయింవచ్చు.దాని ద్వారా 4 నుంచి 5 లక్షల లాభాన్ని పొందవచ్చు.. మంచి లాభాలు వస్తుండటంతో ఇప్పుడు చాలా మంది రైతులు ఈ పంటను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే పంటను వేసుకోండి..