Site icon NTV Telugu

Gold Silver Rates: బంగారం ‘భగభగ’.. వెండి ‘ధగధగ’! రికార్డు ధరల వేళ ఇప్పుడు కొనడం రిస్కేనా?

Silver Investment

Silver Investment

Gold Silver Rates: ఈ రోజుల్లో బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ లేనంతగా పెరుగుతున్నాయి. దీంతో పెట్టుబడిదారుల దృష్టి అంతా వీటిపైనే ఉంది. జనవరి 2026 మొదటి రెండు వారాల్లోనే, బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులను సృష్టించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం 10 గ్రాములకు దాదాపు రూ.1.40 లక్షలకు చేరుకోగా, వెండి కిలోకు రూ.2.60 లక్షలను అధిగమించింది. ఈ రికార్డు ధరల వేళ ఇప్పుడు వీటిని కొనడం రిస్కేనా? ఈ స్టోరీలో చూద్దాం..

READ ALSO: Harsha Richaria: సాధ్వి టూ మోడల్.. హర్షా సన్యాసానికి ఎందుకు గుడ్‌బై చెప్పింది?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ లేనంతగా పెరగడానికి కారణాలను పరిశీలిస్తే.. వీటి పెరుగుదలకు అతిపెద్ద కారణం పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు అని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్, వెనిజులా, చైనా, జపాన్‌లతో కూడిన సంఘటనలు ప్రపంచ మార్కెట్లలో భయం, అనిశ్చితిని పెంచాయి. ప్రపంచ అస్థిరత పెరిగినప్పుడల్లా, పెట్టుబడిదారులు ఈక్విటీలు నుంచి సురక్షితమైన పెట్టుబడులకు నిధులను మారుస్తున్నారు. ఇంకా ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై భారీ సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించడం కూడా మార్కెట్ ఆందోళనలను పెంచింది.

2026 లో కూడా ధరలు పెరుగుతాయా?
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం.. 2026 పూర్తిగా స్థిరమైన సంవత్సరం కాకపోవచ్చని, కానీ అనేక మార్పులు, హెచ్చుతగ్గులతో ఈ ఏడాది ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అటువంటి పరిస్థితిలో బంగారం, వెండి వాటి ప్రాముఖ్యతను కొనసాగించవచ్చని చెబుతున్నారు. కేంద్ర బ్యాంకులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని, ఇదే టైంలో గనుల నుంచి సరఫరా పరిమితంగా ఉందని, పాత బంగారం అమ్మకాలు గణనీయంగా పెరగడం లేదని ఈ నివేదిక పేర్కొంది. ఈ కారణాల వల్ల బంగారం, వెండికి దీర్ఘకాలికంగా పోర్ట్‌ ఫోలియోలకు బలమైన మద్దతు ఉండవచ్చని చెబుతున్నారు.

ఈ టైంలో కొనుగోలు చేయవచ్చా?
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ప్రపంచ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు ప్రస్తుతం స్పష్టంగా లేవని కమోడిటీ నిపుణుడు మనీష్ శర్మ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమీప భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు ఎక్కువగా ఉండవచ్చని చెబుతున్నారు. అయితే ప్రస్తుత పెట్టుబడిదారులు తమ మొత్తం డబ్బును బంగారం, వెండి పెట్టుబడి నుంచి ఉపసంహరించుకోడానికి బదులుగా వారి లాభాలలో 40 నుంచి 50 శాతం బుక్ చేసుకోవడం తెలివైన పని అని సలహా ఇస్తున్నారు. ఇది పెట్టుబడిదారుల లాభాలను కాపాడుతుందని, ధరలు మరింత పెరిగినప్పటికీ వారు పెట్టుబడి పెట్టకుండా ఉండేలా చేస్తుందని పేర్కొన్నారు. పలువురు నిపుణులు మాట్లాడుతూ.. కొత్త పెట్టుబడిదారుల కోసం ఒకేసారి పెద్ద పెట్టుబడులను నివారించమని సలహా ఇస్తున్నారు. రిస్క్ తగ్గించుకోడానికి క్రమంగా, లేదా చిన్న వాయిదాలలో, కుదిరితే SIP వంటి పద్ధతి ద్వారా ఇందులో పెట్టుబడి పెట్టడం మంచిదని చెబుతున్నారు.

READ ALSO: BMC Elections Controversy: మహారాష్ట్ర ఎన్నికల్లో ఇంక్ వార్.. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల సంచలన ఆరోపణలు!

Exit mobile version