NTV Telugu Site icon

Bill Gates: అందుకే ప్రారంభించాను.. మైక్రోసాఫ్ట్ విజయ రహస్యాన్ని చెప్పిన బిల్ గేట్స్

Bill Gates

Bill Gates

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన బిల్ గేట్స్ తన కల గురించి చెప్పారు. సీఎన్బీసీ (CNBC) మేక్ ఇట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. బిల్ గేట్స్ తన కంపెనీ మైక్రోసాఫ్ట్ విజయ రహస్యం ఏమిటో చెప్పారు. తన కెరీర్‌కు సంబంధించిన మరికొన్ని విషయాలను కూడా పంచుకున్నారు. తన కలలను నెరవేర్చుకోవడానికి కళాశాల విద్యను మధ్యలో ఆపేసిన వ్యాపారవేత్తలలో బిల్ గేట్స్ ఒకరు. అయితే.. ఈ జాబితాలో ఆపిల్ యొక్క స్టీవ్ జాబ్స్, మెటా యొక్క మార్క్ జుకర్‌బర్గ్, టెస్లా యొక్క ఎలోన్ మస్క్ కూడా కళాశాల డ్రాపవుట్ అయిన విజయవంతమైన వ్యాపారవేత్తలలో ఉన్నారు.

READ MORE: Indore: బ్యాంక్ ఉద్యోగి భార్యపై ఆర్మీ సైనికుడు అత్యాచారం.. తర్వాత ప్రైవేట్ పార్ట్‌లో..!

ప్రతి ఇంట్లో డెస్క్‌పై పర్సనల్ కంప్యూటర్ ఉండాలన్నది బిల్ గేట్స్ కల. ఈ దృక్పథంతోనే మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించి విజయం సాధించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. సాఫ్ట్‌వేర్‌పై వారి నిబద్ధత, కంప్యూటింగ్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే వారి దృక్పథం నేడు దాదాపు ఫలించింది. హార్వర్డ్ యూనివర్సిటీని విడిచిపెట్టినప్పుడు బిలియనీర్ అవుతానని ఊహించలేదని బిల్ గేట్స్ ఇంటర్వ్యూలో చెప్పారు. డబ్బు లేదా కీర్తి కంటే గొప్ప ఉత్పత్తిని సృష్టించడంపై ఆయన దృష్టి ఉండేదన్నారు. గేట్స్, తన స్నేహితుడు పాల్ అలెన్‌తో కలిసి 1970లలో కంప్యూటర్‌లను యూజర్ ఫ్రెండ్లీగా, సామాన్యులకు అందుబాటులో ఉంచేందు కృషిని ప్రారంభించారు. గేట్స్, అలెన్ తరచుగా దీనిపై పనిచేశారు. గేట్స్ మైక్రోసాఫ్ట్‌కు అత్యంత అంకితభావంతో ఉన్నారు. ‘నా 20వ ఏట అంతా మైక్రోసాఫ్ట్‌దే’ ఆయన చెప్పారు. వారాంత సెలవులను కూడా గేట్స్‌కు నిరాకరించారు. నేడు మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ దాదాపు మూడు ట్రిలియన్ డాలర్లు.

Show comments