Axis Bank: స్టాక్ ట్రేడింగ్ స్కామ్ పేరుతో మోసం.. రూ.97 కోట్లు నొక్కేసిన మేనేజర్ బృందం
- స్టాక్ ట్రేడింగ్ స్కామ్ పేరుతో మోసం
- 97 కోట్లు నొక్కేసిన మేనేజర్ బృందం
- నిందితులను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో స్టాక్ మార్కెంటింగ్ పేరుతో రూ. 97 కోట్ల కుంభకోణానికి పాల్పడిన యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మరియు ముగ్గురు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా ఎనిమిది మందిని బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీళ్లంతా స్టాక్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులు స్టాక్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా భారీ రాబడిని సంపాదించవచ్చంటూ ఖాతాదారులను మోసం చేశారు. ఆరు బ్యాంకు ఖాతాల ద్వారా నిందితులు రూ.97 కోట్లు నొక్కేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ స్కామ్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 254 కేసులు నమోదైనట్లు సైబర్ క్రైమ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు సిబ్బంది ప్రారంభించిన ఆరు బ్యాంకు ఖాతాల ద్వారా రూ.97 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. అరెస్టయిన వారిని పశ్చిమ బెంగళూరులోని యాక్సిస్ బ్యాంక్ నాగరభావి బ్రాంచ్‌లో బ్యాంక్ మేనేజర్ కిషోర్ సాహు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు మనోహర్, కార్తీక్, రాకేష్లుగా పోలీసులు గుర్తించారు. మ్యూల్ అకౌంట్లు నిర్వహించిన లక్ష్మీకాంత, రఘురాజ్, కెంగేగౌడ, మాల సీపీని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
- Milky Mist Founder: 16 ఏళ్లకే చదువు మానేసి పనీర్ అమ్ముతూ.. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు! ఎవరీ సతీష్ కుమార్?
- KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
- PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
ఈ కుంభకోణంపై యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి ఒక ప్రకటనలో ఇలా అన్నారు. ‘‘ఈ విషయం ప్రస్తుతం విచారణలో ఉంది. ప్రక్రియను వేగవంతం చేయడానికి దర్యాప్తు అధికారులకు యాక్సిస్ బ్యాంక్ పూర్తిగా సహకరిస్తోంది.’’ అని తెలిపారు.
ఉత్తర బెంగళూరులోని యలహంక నివాసి మార్చిలో ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. స్టాక్ ట్రేడింగ్ చిట్కాలను అందించిన వాట్సాప్ గ్రూప్‌లో తనను జోడించారని, ట్రేడింగ్ ఖాతాలో పెట్టుబడికి 10 రెట్లు రాబడి వస్తుందని ఆ వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!