Layoffs: 10 నిమిషాల వీడియో కాల్.. 400 మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్..
Layoffs: టెక్ సంస్థల్లో ఉద్యోగాల లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. రెండేళ్లుగా ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో అని టెక్కీలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లో పాటు చిన్నాచితకా కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక అస్థిరత కారణంగా ఖర్చులను తగ్గించుకోవాలనే ఆలోచనలతో సంస్థలు ఉద్యోగులను తీసేస్తున్నాయి.
Read Also: PM Modi: ప్రధాని మోడీపై “ఔరంగజేబు” వ్యాఖ్యలు.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
Also Read
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బెల్(Bell) లేఆఫ్ ప్రకటించింది. కేవలం 10 నిమిషాల వీడియో కాల్లో ఏకంగా 400 మందికి పైగా ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన కంపెనీ వర్చువల్ గ్రూప్ మీటింగ్‌లో బెల్ మేనేజర్ ఈ లేఆఫ్ నోటీసును చదివి వినిపించాడు. ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపుపై కంపెనీ సీఈఓ మిర్కో బిబిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మరిన్ని కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో 4800 మందిని తొలగించాలని చూస్తోంది. ఇది మొత్తం కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో 9 శాతం.
మరోవైపు ఇలా లేఆఫ్స్ ప్రకటించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది సిగ్గుమాలిన చర్య అని కెనడాకు చెంది ఉద్యోగుల సంఘం ‘యూనిఫోర్’ విమర్శించింది. నిమిషాల వ్యవధిలో లేఆఫ్ ప్రకటన చేశారని, కనీసం ఉద్యోగులు ప్రశ్నించే సమయం, అనుమతి కూడా ఇవ్వలేదని ఆరోపించింది. ఓ వైపు వాటాదారులకు డివిడెంట్ పే అవుట్ పెంచడంతో పాటు సామాన్య ఉద్యోగులను తొలగించడాన్ని తప్పుబట్టింది.
తాజావార్తలు
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్‌కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్‌దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో