NTV Telugu Site icon

RBI: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆర్బీఐ.. వాటికోసం ఇక బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరంలేదు..

Rbi

Rbi

వడ్డీ రేట్లను పెంచుతూ షాకిచ్చిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ).. ఇదే సమయంలో ఓ గుడ్‌న్యూస్‌ కూడా చెప్పింది.. ఆన్‌లైన్‌ కేవైసీ వెరిఫికేషన్ పూర్తిచేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్య క్తిగత వివరాల్లోమార్పులేమైనా ఉంటే వాటిని కూడా ఆన్‌లైన్‌లోనే ఆప్‌డేట్‌ చేసుకోవచ్చని తెలిపిందే.. e-KYC చేస్తే బ్యాంకులు బ్రాంచ్ స్థాయిలో వెరిఫికేషన్ అడగకూడదని స్పష్టం చేసింది.. ఒక కస్టమర్ ఈ-కేవైసీ చేసినట్లయితే లేదా సీ-కేవైసీ పోర్టల్‌లో కేవైసీ ప్రక్రియను పూర్తి చేసినట్లయితే, బ్యాంకులు శాఖ స్థాయిలో ధృవీకరణలు/అప్‌డేట్‌లను అడగకూడదని పేర్కొంది.. ఆన్‌లైన్‌లో తమ KYC ధృవీకరణలను పూర్తి చేసిన బ్యాంక్ కస్టమర్లు వార్షిక అప్‌డేట్‌లను అలాగే ఆన్‌లైన్‌లో వారి వ్యక్తిగత వివరాలలో ఏవైనా మార్పులు ఉంటే చేయవచ్చు.. కానీ, ధృవీకరణ/అప్‌డేట్‌ల కోసం సంబంధిత బ్యాంక్‌ బ్రాంచ్‌కి కస్టమర్‌ రావాల్సిందేననే డిమాండ్‌ చేయకూడదని.. దీనిపై రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎలాంటి నిబంధన లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు..

Read Also: World Richest Person: ప్రపంచ కుబేరులు.. ఫస్ట్‌ ప్లేస్‌ కోల్పోయిన ఎలాన్‌ మస్క్.. వివరాలు ఇవిగో..

అలాగే సెంట్రల్-కేవైసీ (సి-కెవైసి) పోర్టల్‌లో తమ కేవైసీ వివరాలను అప్‌లోడ్ చేసిన కస్టమర్లను ఏ బ్యాంకు వెరిఫికేషన్ కోసం అడగకూడదని కూడా గవర్నర్ స్పష్టం చేశారు.. అటువంటి సందర్భంలో, సీ-కేవైసీ పోర్టల్ నుండి కేవైసీ వివరాలను యాక్సెస్ చేయడానికి కస్టమర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నుండి బ్యాంక్‌కి మెయిల్ లేదా మెసేజ్ చేయవచ్చు అని సూచించారు.. ఈ విషయంలో బ్యాంకులకు అవగాహనలేకపోవడంపై తప్పుబట్టారు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రబీ శంకర్.. అటువంటి వివరాలతో కస్టమర్‌లను ఇబ్బంది పెట్టవద్దని సెంట్రల్ బ్యాంక్ క్రమం తప్పకుండా బ్యాంకులను కోరుతుందనిన్నారు.. బహుశా నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి విషయాలు ఉత్పన్నమవుతాయని, బాధిత ఖాతాదారుడు ఎవరైనా దీని గురించి బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు అని చెప్పారు.