NTV Telugu Site icon

Credit Card New Rules :హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ హోల్డర్‌ బ్యాడ్ న్యూస్..ఆగస్టు నుంచి అదనపు ఛార్జీలు

Credit Card

Credit Card

జులై మాసం ముగిసి ఆగస్టు ప్రారంభం కాబోతుంది. దీనితో పాటు, ఆగస్టు 1, 2024 నుంచి అనేక ఆర్థిక మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. మీరు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్నట్లయితే, ఈ వార్త మీకోసమే. ఆగస్టు నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించిన నియమాలు మారబోతున్నాయి. ఇది మీ ఖర్చులను పెంచుతుంది.

READ MORE:Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024.. చరిత్రకు అడుగు దూరంలో మను బాకర్!

అద్దె చెల్లింపుపై అదనపు ఛార్జీ..
ఆగస్టు 1, 2024 నుంచి దేశంలో అమలు చేయాల్సిన ప్రధాన మార్పులలో ఒకటి ఫైనాన్స్‌కు సంబంధించినది. ఇది హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే కార్డ్ హోల్డర్‌లపై ప్రభావం చూపుతుంది. థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా చేసే అన్ని అద్దె లావాదేవీలపై బ్యాంక్ ఇప్పుడు తన క్రెడిట్ కార్డ్ వినియోగదారుల నుంచి 1 శాతం అదనపు ఛార్జీని వసూలు చేస్తుంది. PayTM, CRED, MobiKwik మరియు ఇతర థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగించి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే ఈ నియమం వర్తిస్తుంది. ఒక్కో లావాదేవీకి గరిష్ట పరిమితిని రూ. 3,000గా బ్యాంక్ సెట్ చేసింది.

READ MORE:Fire Accident in Hospital: అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రిలో రాజుకున్న అగ్గి.. తృటితో తప్పిన ఘోర ప్రమాదం

యుటిలిటీ లావాదేవీలకు ఇంత ఎక్కువ ఛార్జీ:
యుటిలిటీ లావాదేవీలకు కూడా అదనపు ఛార్జీలు విధించబడుతున్నాయి. అయితే.. రూ. 50,000 లోపు లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. చెల్లింపు విలువ రూ. 50,000 దాటితే, 1 శాతం ఛార్జ్ విధించబడుతుంది. ఇక్కడ కూడా ఒక్కో లావాదేవీ పరిమితి రూ. 3,000గా నిర్ణయించబడింది.

READ MORE: Hyderabad Crime: కన్న తల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకు.. ఆకలి తట్టుకోలేక తల్లి మృతి..

పెట్రోల్ మరియు డీజిల్‌పై మినహాయింపు..
ఇంధన లావాదేవీలకు సంబంధించి అమలు చేయబోయే కొత్త నియమం ప్రకారం.. కార్డుదారుడు రూ. 15,000 కంటే తక్కువ చమురు చెల్లింపు చేస్తే, అప్పుడు ఎటువంటి రుసుము వసూలు చేయబడదు. అయితే దీని కంటే ఎక్కువ లావాదేవీలకు 1 శాతం ఛార్జ్ చెల్లించాలి. బీమా చెల్లింపులపై ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.