Ask YouTube: యూట్యూబ్ యూజర్లకు సర్ప్రైజ్.. సెర్చ్ బార్లో ఏఐ ఫీచర్ వచ్చేస్తోంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ask YouTube: యూట్యూబ్ తన యూజర్ల కోసం సెర్చ్ అనుభవాన్ని సరికొత్తగా మార్చేందుకు రెడీ అవుతుంది. AI సాయంతో పనిచేసే ‘ఆస్క్ యూట్యూబ్’ (Ask YouTube) అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూట్యూబ్ కేవలం వీడియోల ప్లాట్‌ఫామ్‌గానే కాకుండా, మన సందేహాలను తీర్చే ఒక వ్యక్తిగత ఏఐ అసిస్టెంట్‌గా మారనుంది. సాధారణంగా మనం యూట్యూబ్ సెర్చ్బార్లో ఏదైనా విషయం గురించి టైప్ చేస్తే.. దానికి సంబంధించిన వీడియోల లిస్ట్ వస్తుంది. కానీ ఇకపై ఆ పరిస్థితి మారబోతోంది. గూగుల్ తన జెమిని ఏఐ తరహాలోనే యూట్యూబ్‌లో కూడా నేరుగా ప్రశ్నలు అడిగే సదుపాయాన్ని కల్పిస్తోంది.
ఏమిటీ ‘ఆస్క్ యూట్యూబ్’..
సెర్చ్బార్లో మనం ఏదైనా టైప్ చేసినప్పుడు కొత్తగా ‘ఆస్క్ యూట్యూబ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయగానే ఒక ఫుల్ పేజీ టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీకు కావలసిన ప్రశ్నలను అడగవచ్చు. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే.. మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి కేవలం వీడియోలను మాత్రమే కాకుండా, ఏఐ రూపొందించిన టెక్స్ట్ సమాచారాన్ని కూడా అందిస్తుంది. లాంగ్ వీడియోలు, షార్ట్స్ రూపంలో అత్యుత్తమ సమాచారాన్ని ఇది వెతికి పెడుతుంది. ఉదాహరణకు మీరు ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు కాఫీ షాపుల గురించి అడిగితే.. కేవలం వాటి వీడియోలే కాకుండా, మార్గమధ్యంలో మీరు చూడాల్సిన ఇతర ప్రదేశాల గురించి కూడా ఈ ఏఐ చాట్‌బాట్ సలహాలు ఇస్తుంది.
Also Read
- SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
- Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
ప్రస్తుతం ఎవరికి అందుబాటులో ఉందంటే..
ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అమెరికాలో 18 ఏళ్లు పైబడిన కొంతమంది యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. దీనికి సంబంధించిన పనితీరును వివరిస్తూ యూట్యూబ్ ఒక వీడియోను కూడా తన బ్లాగ్‌లో షేర్ చేసింది. త్వరలోనే ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ గనుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. గూగుల్ సెర్చ్ తరహాలోనే యూట్యూబ్ కూడా ఒక పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ హబ్‌గా మారుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!