NTV Telugu Site icon

Tim Cook: ఆపిల్ లేఆఫ్స్‌పై సీఈఓ టిమ్ కుక్ కీలక వ్యాఖ్యలు..

Tim Cook

Tim Cook

Tim Cook: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు టెక్ సంస్థల్ని, దాని ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం పలు కంపెనీల ఆదాయాలు తగ్గేందుకు కారణం అయ్యాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు పెద్ద ఎత్తు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు మాస్ లేఆఫ్స్ ను ప్రకటించాయి. గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ తో పాటు అనేక ఐటీ కంపెనీలు నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

Read Also: Currency Notes In Drain : మురికి కాల్వలో కరెన్సీ నోట్లు.. వీడియో చూస్తే మీరు షాకే..

ఇదిలా ఉంటే ఆపిల్ సంస్థ కూడా త్వరలో లేఆఫ్స్ ప్రకటిస్తుందనే వార్తల నేపథ్యంలో ఆ సంస్థ సీఈఓ టిక్ కుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే కంపెనీ చివరి ప్రయత్నంలో మాత్రమే ఉద్యోగులను తొలగిస్తుందని ఆయన తెలిపారు. CNBCకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ఆపిల్ కంపెనీ ఖర్చలను తగ్గించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోందని వివరించారు. ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులను తీసేసే బదులు ఇటీవల కాలంలో నియామక ప్రక్రియను తగ్గించుకున్నట్లు వెల్లడించారు.

కరోనా సమయంలో ఇతర టెక్ కంపెనీలు చేసిన విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగులును నియమించుకోలేదు. దీంతోనే ప్రస్తుతం ఇది మెరుగైన స్థితిలో ఉంది. ఏప్రిల్ నెలలో మాత్రం తక్కువ సంఖ్యలో కార్పొరేట్ రిటైల్ డివిజన్ ఉద్యోగులను తొలగించింది. ఇలాంటి సవాళ్ల మధ్య యాపిల్ మార్చి త్రైామాసికంలో 98.8 బిలియన్ డాలర్ల రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది. ఇందులో ఎక్కువగా ఐఫోన్ అమ్మకాల ద్వారానే వచ్చాయి. వీటి వల్లే 51.3 బిలియన్ డాలర్లు వచ్చాయి. భారత్ లో కూడా కంపెనీ రికార్డ్ ఆదాయాన్ని నమోదు చేసింది. ఇటీవల భారత్ వచ్చిన టిమ్ కుక్, ముంబై, ఢిల్లీలో రిటైల్ స్టోర్లను ప్రారంభించారు. ప్రధాని మోదీతో పాటు మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. భారత్ లో ఆపిల్ పెట్టుబడుల గురించి చర్చించారు.