ట్విట్టర్, ఫేస్‌బుక్, మరికొన్ని ఐటీ దిగ్గజ సంస్థలు కూడా తమ ఉద్యోగులను తగ్గించుకునేపనిలో పడిపోయాయి.. ట్విట్టర్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత.. చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి.. ఐటీ సెక్టార్‌లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు కోత తప్పదనే వార్తలు కూడా కలవరపెడుతున్నాయి.. మరోవైపు.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా అదేబాటపట్టినట్టుగా తెలుస్తోంది.. ఏకంగా 10,000 మంది ఉద్యోగాలకు ఎసరు వచ్చేలా కనిపిస్తోంది.. కార్పొరేట్, టెక్నాలజీ విభాగంలోని ఉద్యోగులను ఈ వారం నుంచే తొలగించేందుకు అమెజాన్ ప్లాన్ చేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.. అమెజాన్ రోబోటిక్స్ బృందంలో పనిచేస్తున్న వారికి పింక్ స్లిప్‌లు ఇచ్చినట్టు ఓ అధికారి వెల్లడించినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
Read Also: Mahesh Babu: గుండె పగిలేలా ఏడుస్తున్న మహేష్.. తట్టుకోలేకపోతున్న అభిమానులు
అమెజాన్ పెద్ద సంఖ్యలను ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైందని.. అమెజాన్ రోబోటిక్స్ విభాగంలో 3,766 మంది పనిచేస్తుండగా.. వారిలో మెజార్టీ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని అభిప్రాయపడింది.. కానీ, ఎంతమంది అనే విషయాన్ని పేర్కొనలేదు.. అంతేకాదు.. లాభాలను రాబట్టలేకపోతున్న కొన్ని విభాగాల్లోని ఉద్యోగులకు.. ఇప్పటికే సమాచారం ఇచ్చారు.. ఏదైనా కొత్త ఉద్యోగం చూసుకోవాలని సూచించారని సమాచారం.. ఉద్యోగాల కోతలు ఈ-కామర్స్ దిగ్గజం యొక్క పరికరాల యూనిట్‌పై దృష్టి పెడతాయి, ఇది వాయిస్-అసిస్టెంట్ అలెక్సా, అలాగే దాని రిటైల్ విభాగం, మానవ వనరులను కలిగి ఉంది, అలెక్సాను కలిగి ఉన్న యూనిట్ సంవత్సరానికి 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూస్తోంది.. వినియోగదారులు కొన్ని ఫంక్షన్ల కోసం పరికరాన్ని ఉపయోగించినప్పుడు కొత్త సామర్థ్యాలను జోడించడంపై దృష్టి పెట్టాలని అమెజాన్ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.
తొలగింపులు దాని కార్పొరేట్ సిబ్బందిలో 3 శాతం వరకు ఉంటాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.. రాబోయే కొద్ది నెలల పాటు కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌కు నియామకాలను స్తంభింపజేస్తామని అమెజాన్ ఇటీవల తెలిపింది.. పెరుగుతున్న ధరల కారణంగా వినియోగదారులు మరియు వ్యాపారాలు ఖర్చు చేయడానికి ముందుకు రాకపోవడం.. అత్యధిక అమ్మకాలను ఉత్పత్తి చేస్తున్నప్పుడు బిజీగా ఉన్న సెలవు సీజన్‌లో వృద్ధి మందగించడంపై అమెజాన్ హెచ్చరించిన కొద్ది వారాల తర్వాత ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. ఒకేసారి ఏకంగా 10 వేల ఉద్యోగాలు ఊడిపోతాయన్న వార్తల నేపథ్యంలో.. ఆ సంస్థ ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది.