Air India: ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్.. కేవలం రూ.1,499కే విమాన టిక్కెట్లు!
- ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్
- కేవలం రూ.1,499కే విమాన టిక్కెట్లు
- ఫిబ్రవరి 6వ తేదీ వరకు అందుబాటులో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమాన ప్రయాణం చేయాలని అంతా కలలుకంటుంటారు. కానీ, ఛార్జీలు వేలల్లో ఉండడంతో సామాన్యులకు సాధ్యపడదు. అయితే ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. చౌక ధరలోనే విమాన ప్రయాణం చేయొచ్చు. ఎలా అంటే? ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా విమాన టికెట్స్ పై ఆఫర్లు ప్రకటించింది. ఎయిరిండియా తీసుకొచ్చిన నమస్తే వరల్డ్ సేల్ లో భాగంగా కేవలం రూ.1499కే విమాన ప్రయాణం కల్పిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల టికెట్లపై భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు తెలిపింది.
ఈ సేల్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండనున్నది. ఫిబ్రవరి 2 నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభమై ఫిబ్రవరి 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో బుకింగ్ చేసుకున్న వారు ఫిబ్రవరి 12 నుంచి అక్టోబర్ 31వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చని తెలిపింది. ఈ ఆఫర్ ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ కి వర్తిస్తుంది. ఈ ఆఫర్లో దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు రూ.1499 నుంచి ప్రారంభవుతున్నాయి. ప్రీమియం ఎకానమీ రూ. 3,749 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే బిజినెస్ క్లాస్ అయితే రూ.9,999 నుంచి టికెట్ రేట్లు ప్రారంభమవుతున్నాయి.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.12,577 నుంచి ప్రారంభమవుతుండగా.. ప్రీమియం ఎకానమీ రూ.16,213 నుంచి ప్రారంభమవుతుంది. బిజినెస్ క్లాస్ విమాన టికెట్ ధర రూ.20,870 నుంచి మొదలవుతున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఎయిరిండియా అధికారిక వెబ్సైట్, యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!