Edible Oil Prices: సామాన్యులకు ఊరట.. తగ్గిన వంట నూనెల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani Wilmar cuts prices of edible oil: నిత్యావసర ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ప్రముఖ ఆయిల్ ఫార్చూన్ బ్రాండ్ కంపెనీ అదానీ విల్మర్ గుడ్‌న్యూస్ అందించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో ఫార్చూన్ బ్రాండ్‌పై విక్రయించే వంట నూనెల ధరలను రూ.30 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఫార్చూన్ బ్రాండ్ వంట నూనెల ధరలు దిగి రానున్నాయి. ఫార్చూన్ సోయా బీన్ ఆయిల్ రూ.195 నుంచి రూ.165కు తగ్గనుంది. ఫార్చూన్ సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.210 నుంచి రూ.199కి, ఆవ నూనె గరిష్ఠ ధర రూ.195 నుంచి రూ.190కి తగ్గుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ రూ.225 నుంచి రూ.210కి తగ్గుతుంది. వేరుశనగ నూనె రూ.220 నుంచి రూ.210కి, రాగ్ బ్రాండ్‌పై విక్రయించే వనస్పతి రూ.200 నుంచి రూ.185కి చేరనుంది. రాగ్ పామోలిన్ రూ.170 నుంచి రూ.144కి తగ్గనుంది.
Read Also: Gold Coins: బాత్రూమ్ కోసం తవ్వితే.. గోల్డ్ కాయిన్స్ బయటపడ్డాయి
Also Read
- TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
- Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
- Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
- UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
కాగా వంట నూనెల ధరలు తగ్గించడంపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు దిగిరావడంతో దేశంలోనూ ధరలు తగ్గించాలని సదరు ఆయిల్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దిగుమతి చేసుకున్న వంటనూనెల గరిష్ట రిటైల్ ధరను వారంలోగా లీటరుకు పది రూపాయల వరకు తగ్గించాలని ప్రభుత్వం వంట నూనెల ఆయిల్ తయారీదారులను ఆదేశించింది. దీంతో పలు కంపెనీలు వంట నూనెల ధరలను తగ్గిస్తున్నాయి. తగ్గిన వంటనూనెల ధరలు త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని అదానీ విల్మర్ కంపెనీ సీఈవో అంగ్షు మల్లిక్ తెలిపారు. రాబోయే పండగ సీజన్‌లో డిమాండ్ పెరుగుదలకు ఈ తగ్గింపు ఊతమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా విదేశాల్లో నూనె గింజల రేట్లు భారీగా పతనమవుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం కూడా తగ్గించడంతో ఆయిల్ రేట్లు తగ్గుముఖం పట్టాయి.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!