Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
- ప్రభావవంతమైన వ్యాపారవేత్తలలో ఎలాన్ మస్క్ ఒకరు
- మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడు
- మస్క్ సెకనుకు రూ.2.2 లక్షలు సంపాదిస్తాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలాన్ మస్క్ వరల్డ్ వైడ్ గా పరిచయం అక్కర్లేని పేరు. టెక్నాలజీ రంగంలో మస్క్‌కు గొప్ప పేరుంది. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరు. టెస్లా, స్పేస్ఎక్స్ వంటి కంపెనీల ద్వారా, టెక్నాలజీ, అంతరిక్ష పరిశ్రమలను పూర్తిగా మార్చివేశారు. మరి మస్క్ సంపద ఎంత? నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడు అని ఎప్పుడైనా ఆలోచించారా? నిమిషానికి మస్క్ ఆదాయం తెలిస్తే సామాన్యులే కాదు కోటీశ్వరులు కూడా ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
నవంబర్ 2025 నాటికి మస్క్ నికర ఆస్తి విలువ సుమారుగా రూ.39.6 లక్షల కోట్లు (≈ $477.7 బిలియన్లు)గా అంచనా వేశారు. కేవలం 2025లోనే మస్క్ సంపద సుమారుగా రూ.6.4 లక్షల కోట్లు పెరిగింది. ఎలాన్ మస్క్ టెస్లా షేర్లు, స్పేస్ఎక్స్ విలువ ఆధారిత పెట్టుబడులు, క్రిప్టో, ఇతర వ్యాపారాల ద్వారా చాలా డబ్బు సంపాదిస్తాడు. మస్క్ కేవలం టెస్లాకే పరిమితం కాదు. న్యూరాలింక్ (బ్రెయిన్-చిప్ టెక్నాలజీ), ది బోరింగ్ కంపెనీ (భూగర్భ సొరంగాలు), ఏఐ, ఇతర టెక్ ప్రాజెక్టులు అన్నీ అతని నికర విలువకు దోహదం చేస్తాయి.
Also Read
- Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. పతనానికి కారణమిదే!
- Sugar Import Deadline 2026: పండుగల వేళ కేంద్రం కీలక నిర్ణయం.. చక్కెర దిగుమతుల గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు
- Gold Rates: మరో సారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే..
- Govt Banks: ఆ 4 బ్యాంకులకు ఆర్థిక శాఖ షాక్.. గడువు పొడిగింపుపై ఉత్కంఠ..
1 సెకనులో ఎంత సంపాదిస్తారు?
లైట్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం, మస్క్ సెకనుకు రూ.2.2 లక్షలు సంపాదిస్తాడు.
1 నిమిషం సంపాదన
మరోవైపు, మస్క్ నిమిషానికి సుమారు రూ.1.36 కోట్లు సంపాదిస్తాడు. చాలా మంది తమ జీవితకాలంలో అంత డబ్బు సంపాదించలేరు.
1 గంటలో ఎంత డబ్బు సంపాదిస్తారు?
అంతేకాకుండా, మస్క్ గంటకు సుమారుగా రూ.816 మిలియన్లు (816 మిలియన్ల రూపాయలు) సంపాదిస్తాడు. అంటే కేవలం ఒక గంటలోనే మిలియనీర్ అవ్వడమే కాకుండా, బిలియనీర్ అయ్యే దిశగా పయనిస్తున్నాడు.
నివేదికల ప్రకారం, ఎలాన్ మస్క్ రోజుకు సుమారు రూ.1,960 కోట్లు సంపాదిస్తాడు. ఆ మొత్తంతో ఒక చిన్న పట్టణంలోని స్థిరాస్తి మొత్తాన్ని కొనుగోలు చేయవచ్చు. మస్క్ నెలసరి ఆదాయం సుమారుగా రూ.58,800 కోట్లు (సుమారుగా $5.8 బిలియన్ డాలర్లు). వార్షిక ఆదాయం సుమారుగా రూ.7.15 లక్షల కోట్లు (సుమారుగా $7.15 బిలియన్ డాలర్లు)గా అంచనా వేశారు. ఇది స్థిరమైన ఆదాయం కాదు.. ఇది మస్క్ షేర్ల విలువను బట్టి మారుతూ ఉంటుంది.
తాజావార్తలు
-
YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Oppo Pad Mini: భారత్‌లో Oppo Pad Mini లాంచ్.. 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ, ధర ఎంతంటే?
-
Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
-
Rohit Sharma All Time Record: రోహిత్ శర్మ ఆల్-టైమ్ రికార్డు డేంజర్లో ఉందా..? ఆ సత్తా ఎవరికి ఉంది?
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య