ఈ రోజు మీరు చేసే పొదుపు రేపు మిమ్మల్ని రక్షిస్తుంది. డబ్బులు చేతిలో ఉంటే నలుగురికి సాయం చేయొచ్చు. అందుకే డబ్బును అవసరానికి మాత్రమే ఉపయోగించాలని సూచిస్తుంటారు. మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని నిపుణులు చెబుతుంటారు. మరి మీరు కూడా తక్కువ పెట్టబడితో ఎక్కువ లాభాలను పొందాలని చూస్తున్నారా? అయితే పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్ ఉంది. అదే గ్రామ సురక్ష యోజన. ఇందులో రోజుకు రూ. 50 ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటి నాటికి ఏకంగా రూ. 35 లక్షలు అందుకోవచ్చు. పోస్టాఫీసు గ్రామ సురక్ష యోజన గ్రామీణ పౌరులకు ఆర్థిక భద్రత, మంచి రాబడిని అందిస్తుంది.
పోస్టాఫీస్ స్కీమ్స్ కు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది కాబట్టి రిస్క్ ఉండదు. గ్యారంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. గ్రామ్ సురక్ష యోజన గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఒక భాగం. ఈ గ్రామ సురక్ష యోజనలో 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో రూ. 10 వేల నుంచి రూ. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీరు ప్రీమియంను నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికంగా కూడా చెల్లించొచ్చు. లోన్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.
మీరు రూ. 10 లక్షల ప్రీమియం ఎంచుకుంటే.. 19 ఏళ్ల వయసులో ఈ స్కీంలో చేరితే 55 సంవత్సరాలు వచ్చే వరకు నెలకు రూ. 1515 చొప్పున చెల్లించాలి. 58 ఏళ్ల వరకు ఈ స్కీంలో నమోదు చేసుకుంటే అప్పుడు రూ. 1463, 60 ఏళ్లకు అయితే రూ. 1411 డిపాజిట్ చేయాలి. ఈ పథకంలో మీరు 55 ఏళ్ల ప్రీమియం ఎంచుకుంటే మెచ్యూరిటీ నాటికి రూ. 31.60 లక్షల కార్పస్ పొందుతారు. 58 సంవత్సరాల ప్రీమియం ఎంచుకుంటే మెచ్యూరిటీ నాటికి రూ. 33.40 లక్షల కార్పస్ పొందుతారు. 60 సంవత్సరాల ప్రీమియం ద్వారా రూ. 34.40 లక్షలు అందుకుంటారు. పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడిదారుడు మరణిస్తే, అతని కుటుంబానికి మొత్తం ఫండ్ అందుతుంది. తద్వారా పెట్టుబడిదారు కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.