బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న డైలీ సీరియల్ కార్తీక దీపం.. ఈ సీరియల్ లో విలన్ పాత్రలో కనిపించిన మోనిత అలియాస్ శోభా శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆ సీరియల్ ద్వారా ఓ రేంజులో పాపులర్ అయిన శోభా ఇటీవలే స్టార్ మా రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ను అందుకుంది.. బిగ్ బాస్ లో ఉన్నప్పుడే తన ప్రేమ వ్యవహారాన్ని సైతం బయటపెట్టింది. బిగ్ బాస్ షోలో నెగిటివిటీ తెచ్చుకొని బయటికి వచ్చేసింది..
ఏదైతేనేం బిగ్ బాస్ దత్త పుత్రికగా బాగానే రెమ్యూనరేషన్ ను అందుకుంది.. అంతేకాదు మొన్నీమధ్య ప్రియుడుతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.. ఆ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి… తన సహనటుడైన యశ్వంత్ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ఈమె బిగ్ బాస్ హౌస్ లో తెలియజేసింది. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది.. తాజాగా మరో శుభవార్త చెప్పింది శోభ. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న తన కల ఇప్పుడు సాకారమైందని, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజు కొత్తింటికి సంబందించిన తాళం తన చేతికొచ్చిందని తెలిపింది..
అయితే బిగ్‌బాస్ ఇచ్చిన డబ్బులతో ఈ ఇల్లు తీసుకోలేదని, రెండేళ్ల క్రితమే దీన్ని కొనుగోలు చేశామని తెలిపింది శోభ. ప్రియుడితో కొత్తింటిలో ఆమె దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది.. ఇక సీరియల్స్ విషయానికొస్తే కొత్త సీరియల్స్ ఇంకా అనౌన్స్ చెయ్యలేదు.. అయితే పెళ్లి తర్వాత నటిస్తుందా? అనే సందేహం కూడా ఆమె అభిమానులకు కలుగుతుంది.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది..