Site icon NTV Telugu

Rithu Chowdary : హౌస్ లో ఇద్దరు కావాలా.. రీతూ ఏంటీ దరిద్రం..

Rithu

Rithu

Rithu Chowdary : రీతూ చౌదర వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదం రేపుతోంది. హీరో ధర్మతో అర్ధరాత్రి అతని ఫ్లాట్ కు వెళ్లిన వీడియోలను గౌతమి లీక్ చేసి సంచలనం రేపింది. దెబ్బకు రీతూ చౌదరిని ట్రోల్స్ చేసి ఏకి పారేస్తున్నారు. రీతూకు గతంలో శ్రీకాంత్ అనే వ్యాపారితో రెండో పెళ్లి అయింది. ఆ తర్వాత రీతూ మీద అక్రమాస్తుల కేసు నమోదైంది. దానికి తోడు బెట్టింగ్ యాప్స్ కేసుతో మరింత వివాదానికి దారి తీసింది. ఇలా వరుస కాంట్రవర్సీలతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అక్కడ కూడా తన బిహేవియర్ మార్చుకోవట్లేదు. ఇద్దరిని తన వెంట తిప్పుకుంటూ పిచ్చోళ్లను చేసి ఆడిస్తోంది. డిమాన్ పవన్, పవన్ కల్యాణ్‌ లను తన మాటలతో వలలో వేసుకుని వెంట తిప్పుకుంటోంది రీతూ.

Read Also : Tamannaah : అల్లు అర్జున్ వల్లే ఇన్ని కోట్లు సంపాదించా

వాళ్లిద్దరూ రీతూ కోసం ఏం చేయడానికైనా రెడీ అన్నట్టు రెచ్చిపోతున్నారు. రీతూ ఆడించే ఆటలో వాళ్లిద్దరూ ఆడేస్తున్నారు. ఇది చూసిన వారంతా రీతూను దుమ్మెత్తి పోస్తున్నారు. అక్కడ కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటమ్మా.. ఒకరితో సరిపెట్టుకోవచ్చు కదా.. నీకు బయట ఇద్దరు, లోపల ఇద్దరు కావాలా అంటూ ఏకి పారేస్తున్నారు. మరి ఇంత దిగజారిపోతావా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రీతూ చౌదరి మాత్రం అవేవీ మనకు పట్టవు అన్నట్టు రెచ్చిపోతోంది. ఆమె ఆడుతున్న ఆట.. ప్రవర్తిస్తున్న తీరుతో అందరి దృష్టిలో పడాలనుకుంటోంది. ఈ వారం నామినేషన్స్ లో ఉంది. చూస్తుంటే ఈ వారం ఎలిమినేట్ అవుతుందనే ప్రచారం ఉంది. మరి బయటకొస్తుందా.. జర్నీ కంటిన్యూ చేస్తుందా చూడాలి.

Read Also : Katrina Kaif : తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్

Exit mobile version