బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో ఆరోవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడం కోసం కంటెస్టెంట్స్ తెగ కష్టపడుతున్నారు.. కొత్తగా వచ్చిన వారి వల్ల బిగ్ బాస్ రెండు గ్రూపులుగా ఆటగాళ్లు, పోటుగాళ్లు అంటూ రెండు గ్రూపులుగా విడదీసి గేమ్ ఆడిస్తున్నాడు.. మొదటిసారి ప్రశాంత్ బిగ్ బాస్ టీమ్ కు కెప్టెన్ అయ్యాడు.. అయితే కెప్టెన్ గా ప్రశాంత్ బాధ్యతలు నిర్వర్తించడం లేదని.. కెప్టెన్ బ్యాడ్జ్ లాగేసుకొని.. ఆ తర్వాత యాక్టివిటి రూంకు పిలిచి మాట్లాడి తిరిగి కెప్టెన్ బ్యాడ్జ్ అందించారు బిగ్‌బాస్.. ఇక అందరు ప్రశాంత్ ను బయటకు పంపాలని చూస్తున్నారు.. సీరియల్ బ్యాచ్ మొత్తం అతన్ని టార్గెట్ చేశారు..
అమర్ దీప్ మాత్రం ప్రశాంత్ ఏం చేసినా తప్పే అన్నట్లు మాట్లాడుతూ..నువ్వెంట్రా అన్నట్లుగా బిహేవ్ చేయడంతో ప్రతి వారం నాగార్జున చేతిలో తిట్లు తినడం చూశాం. ఇప్పుడిప్పుడే అమర్ దీప్ తన ఆట తీరును మార్చుకుంటున్నాడు. ఎదుటివాళ్ల కోసం కాదు తన కోసం గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే పల్లవి ప్రశాంత్‌తో సైతం తన స్నేహాన్ని పెంచుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు.. అటు అర్జున్ కు కూడా ప్రశాంత్ నచ్చలేదు.. అతన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు..
హౌస్ లోకి అడుగుపెట్టడంతోనే అమర్ దీప్ ను నామినేట్ చేసి ఆశ్చర్యపరిచాడు. అతడిని నామినేట్ చేస్తూ అర్జున్ చెప్పిన పాయింట్స్.. ఆ తర్వాత అతడు గేమ్ ఆడే విధానం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో వచ్చిన నాలుగు రోజుల్లోనే అర్జున్ పై పాజిటివిటీ టాక్ వచ్చేసింది. కానీ అంతలోనే అర్జున్ తన మాస్క్ తీసేసినట్లుగా కనిపిస్తుంది. గురువారం రాత్రి లైవ్ లో రైతు బిడ్డపై విషాన్ని కక్కాడు. హౌస్ లో అర్జున్ ఏదో సలహా ఇస్తే ప్రశాంత్ తీసుకోలేదట.. దాంతో తన పై కోపం ఉన్నట్లు గౌతమ్ దగ్గర చెప్పుకొచ్చాడు.. టాస్కులోనూ సహనంగా ఉంటూ అందరితో కలిసిపోయాడు అర్జున్. కానీ అంతలోనే రైతుబిడ్డ గెలుపు మింగుడుపడడం లేదని లైవ్ లో అర్జున్ మాటలు వింటే తెలుస్తోందని అంటున్నారు… ప్రస్తుతం అర్జున్ ప్రశాంత్ దృష్టిలో నెగిటివ్ అయ్యాడు.. అతనికి దూరంగా ఉంటున్నాడు.. మరోవైపు శివాజీ, యావర్ దూకుడు మీద ఉన్నారు.. యావర్ అనుకున్నట్లు సాధించాడు.. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఎలా ఉంటుందో చూడాలి..