బిగ్ బాస్ 5 : వైల్డ్ కార్డు ఎంట్రీ… ఆ ఇద్దరిలో ఒకరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బిగ్ బాస్ 5″లో రచ్చ రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం, మంగళవారం ఎపిసోడ్లు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. ప్రత్యేకించి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిజ స్వరూపాలు నెమ్మదిగా బయట పడుతున్నాయి. ఒక్కొక్కరుగా ముసుగు తొలగిస్తుండడంతో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. అసభ్యకర కామెంట్స్ కారణంగా నెటిజన్లు ఉమాదేవిపై, పొగరుగా బిహేవ్ చేసినందుకు శ్వేత వర్మపై కూడా ఫైర్ అయ్యారు. శ్వేత వర్మ లోబో ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ని విసిరి అతడిని ఫేక్ అని పిలిచింది. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అనీ పట్ల ఉమా దేవి అగౌరవంగా, అమానవీయంగా ప్రవర్తించినందుకు ఆమెనూ విమర్శించింది. రెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారమే ముగిసినప్పటికీ ఇంకా అదే చర్చనీయాంశం అవుతోంది. నిన్న కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గేమ్ కూడా కొట్టుకోవడానికే అన్నట్టుగా ఆడారు.
Read Also : ట్రెండింగ్ లో “లెహరాయి” లిరికల్ వీడియో సాంగ్
Also Read
తాజా బజ్ ప్రకారం బిగ్ బాస్ నిర్వాహకులు రాబోయే రెండు వారాల్లో వైల్డ్ కార్డ్‌గా మరో అందమైన మహిళను హౌస్ లోకి పంపడానికి ప్లాన్ చేస్తున్నారు. నవ్య లేదా వర్షిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని సమాచారం. ఇంతకుముందు నవ్య బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ప్రవేశిస్తుందని టాక్ బాగా వినిపించింది. అయితే ఆమె హౌస్ లో అడుగు పెట్టలేదు. దీంతో ఈ సీజన్లో నవ్య వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇస్తుందని భావిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం “బిగ్ బాస్ 5” తెలుగు మేకర్స్ యాంకర్ వర్షిణితో కూడా చర్చలు జరుపుతున్నట్లు మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ రూమర్స్ లో నిజం ఎంతుందో తెలియాలంటే వేచి చూడాలి.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? వాస్తు ప్రకారం కారణం ఈ అమరికలేనా?
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!