ట్రెండింగ్ లో “లెహరాయి” లిరికల్ వీడియో సాంగ్

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ చిత్రం అక్టోబర్ 8 న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమాలోని “లెహరాయి” అనే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశారు. ఇంతకుముందే ఈ సాంగ్ కు సంబంధించిన చిన్న ప్రోమోను విడుదల చేసి అందరిలో ఆసక్తిని రేకెత్తించిన మేకర్స్ తాజాగా పూర్తి లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను సిద్ శ్రీరామ్ పాడగా, శ్రీమణి ఈ సాంగ్ ను లిరిక్స్ అందించారు. సంగీతం గోపి సుందర్ అందించారు. ఇక ఈ సాంగ్ విడుదలైన రోజు నుంచి వైరల్ అవుతోంది. ఈరోజు పూర్తి సాంగ్ రావడంతో సోషల్ మీడియాలో “లెహరాయి” ట్రెండ్ అవుతోంది.

Read Also : “లైగర్” వయోలెన్స్ స్టార్ట్

బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వం వహించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రం ఒక ఎన్నారై హర్ష, విభా అనే స్టాండ్-అప్ కమెడియన్ ల మధ్య చిగురించే ప్రేమ కథ. ఈ సినిమాలో అఖిల్, పూజా హెగ్డే లతో పాటు ఈషా రెబ్బా, ఆమని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, జయప్రకాష్, ప్రగతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా విడుదల కోసం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-