ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేషన్స్‌లో ఎక్కువ మంది కంటెస్టెంట్లు ఉండటంతో ‘బిగ్ బాస్ తెలుగు 5’ హౌస్‌లో టెన్షన్ నెలకొంది. ఓటింగ్ ప్రకారం చూస్తే వీక్షకులలో ఎలిమినేషన్ నుండి సేవ్ కాబోతున్న పోటీదారులు ఎవరు? అనే చర్చ మొదలైంది. గత ఎలిమినేషన్లు, ప్రస్తుత ఓటింగ్ ను పరిగణలోకి తీసుకుంటే, హౌస్‌మేట్స్‌లో ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉండబోతున్నారు. ఈ రియాల్టీ షోలో ఇప్పుడు 11 మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉండటంతో పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్న ఇంటి సభ్యుల్లో కాజల్ కూడా ఒకరు. ఈ విశ్లేషణ ఓట్ల ఆధారంగా కాదు కంటెస్టెంట్ల ఆమెకున్న బంధంపై ఆధారపడి జరుగుతోంది. కంటెస్టెంట్లు ఎక్కువగా వ్యతిరేకిస్తున్న పోటీదారులలో కాజల్ ఒకరు.
Read Also : వీడియో : “అఖండ” టైటిల్ సాంగ్ టీజర్
వీకెండ్‌లో ఎలిమినేషన్ లో డేంజర్ జోన్ లో ఉన్న మరో ఇద్దరు హౌస్‌మేట్స్ విశ్వ, జెస్సీ. విశ్వ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ, అతని ఆట చూసేవారికి కన్పించడం లేదు. కాబట్టి ఇతర పోటీదారుల కంటే విశ్వా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అలాగే జెస్సి కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. జెస్సీ ఆరోగ్యం బాగోకపోవడంతో చాలా పనులకు దూరంగా ఉంటున్నాడు. కాబట్టి ఇది ఓటింగ్‌పై ప్రభావం చూపవచ్చు. పైగా ఆయన అనారోగ్యం కారణంగా జెస్సి బయటకు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా కన్పిస్తున్నాయి.