NTV Telugu Site icon

బిగ్ బాస్ 5 : లహరి ఎంత పారితోషికం తీసుకుందంటే ?

Shriya Saran visits tirumala along with husband

బిగ్ బాస్ హౌస్ నుండి వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. సరయు, ఉమాదేవి తరువాత లహరి గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్. నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 5 తెలుగు’ నుండి లహరి ప్రారంభంలోనే వెళ్లిపోవడం చాలా మందిని బాధ పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్‌తో సహా చాలా మంది ఆమెను హౌస్ నుండి సీక్రెట్ రూమ్‌కు మార్చే అవకాశం ఉందని భావించినప్పటికీ, వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ప్రకటన చాలా మందిని నిరాశపరిచింది. ఆమె వెళ్ళిపోయాక షో ఏమాత్రం ఇంటరెస్టింగ్ గా లేదని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.

Read Also : ఆ హీరో, హీరోయిన్లు విడిపోతే భరణం ఉండదా!?

ఇదిలా ఉండగా ఆమె మూడు వారాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనే విషయంపై అందరి దృష్టి పడింది. సమాచారం మేరకు లహరి వారానికి రూ.లక్ష రెమ్యునరేషన్ తీసుకుందట. ఆమె హౌజ్ లో ఉంది మొత్తం మూడు వారాలు కాబట్టి లహరి మొత్తం రెమ్యునరేషన్ రూ. 3 లక్షలు.

ఈ వారం మొత్తం ఎనిమిది మంది పోటీదారులు రవి, ప్రియ, నటరాజ్, లోబో, కాజల్, సిరి, సన్నీ నామినేషన్ జాబితాలో ఉన్నారు. ఈసారి బిగ్ బాస్ ఈ వారం అబ్బాయిలను బయటకు పంపిస్తారా ? అనే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వీకెండ్ వరకు వేచి చూడాలి.