పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిస్తే ఇంకా రెండు వారాలే ఉంటుంది షో. ప్రస్తుతం హౌస్‌లో “టికెట్ టు ఫైనల్” టాస్క్ కొనసాగుతోంది. గురువారంతో ముగియాల్సిన ఈ టాస్క్ ను మరో రోజు పొడిగించారు. టాస్క్‌ల తర్వాత ఇంకా నలుగురు పోటీదారులు “టికెట్ టు ఫైనల్” రేసులో ఉన్నారు.
Read Also : ‘అఖండ’ రోరింగ్ హిట్… ఫస్ట్ డే కలెక్షన్స్
“టికెట్ టు ఫైనల్”లో భాగంగా హౌస్‌మేట్స్‌కి బిగ్ బాస్ వరుస టాస్క్‌లు ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎండ్యూరెన్స్ టాస్క్ శ్రీరామ్, సిరి ఆరోగ్య పరిస్థితిని బాగా దెబ్బ తీసింది. ఆ తర్వాత ఫోకస్ టాస్క్ ఇచ్చారు. దీనిలో హౌస్‌మేట్స్ తమ మనస్సులో 29 నిమిషాలు లెక్కించాలి. హౌజ్ మేట్స్ వాళ్ళను డిస్టర్బ్ చేయొచ్చు. అందులో ఎవరు కరెక్ట్ గా లెక్కిస్తారో వారు విజేత అవుతారు. ఈ టాస్క్‌లో మానస్ గెలిచాడు.
Read Also : రవితేజ లక్ మాములుగా లేదుగా… అట్టర్ ఫ్లాప్ జస్ట్ మిస్ !
తర్వాత స్కిల్ టాస్క్ వచ్చింది. ఈ టాస్క్‌లో హౌస్‌మేట్స్ చిన్నపాటి గేమ్ ఆడాలి. తోటలో ఒక వాల్ ఉంటుంది. హౌస్‌మేట్స్ వాల్ కింద ఉన్న కూజాలో ఉంచిన బంతులు, వాలుపై ఉంచిన రంధ్రాల ద్వారా పైకి వచ్చే వరకు నీళ్లు పోస్తూ ఉండాలి. ఎండ్యూరెన్స్ టాస్క్‌లో శ్రీరామ్, సిరి గాయపడడంతో వారి తరపున సన్నీ, షణ్ముఖ్ ఈ టాస్క్ ఆడారు. మొత్తం మీద షణ్ముఖ్‌తో టై బ్రేకర్ టాస్క్ ఆడిన తర్వాత సన్నీ ఈ టాస్క్‌లో గెలిచాడు. చివరగా మానస్, సన్నీ, సిరి, శ్రీరామ్ ఈ రేసులో మిగిలారు. ఈ నలుగురిలో ఒకరు నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఫైనల్‌కి టికెట్ గెలుస్తారు. మరి ఈ టాస్క్‌లో ఎవరు విజేత అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.