Site icon NTV Telugu

Bigg Boss 9 Flora Saini :ముఖం, ప్రైవేటు భాగాలపై ఇష్టమొచ్చినట్టు కొట్టిన ప్రముఖ నిర్మాత

Bigg Boss Asha Saini

Bigg Boss Asha Saini

తెలుగు సినిమా పరిశ్రమలో నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ఫ్లోరా సైనీ (ఆశా సైనీ) తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. ఓ ప్రముఖ నిర్మాత తనను 14 నెలల పాటు చిత్రహింసలకు గురిచేశాడని, తన జీవితంలో నరకం చూపించాడని ఆమె బిగ్ బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చి తన చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటూ ఆ నిర్మాత దారుణ ప్రవర్తన గురించి వెల్లడించింది. ఆశా సైనీ చెప్పిన వివరాల ప్రకారం, ఆమె ఓ ప్రముఖ నిర్మాతను ప్రేమించింది. అయితే, కొద్ది రోజుల్లోనే అతని అసలు స్వరూపం బయటపడిందని, అతను తనపై దారుణంగా ప్రవర్తించాడని తెలిపింది. “నా ముఖం, ప్రైవేటు భాగాలపై ఇష్టమొచ్చినట్టు కొట్టేవాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేందుకు నా ఫోన్‌ను కూడా లాక్కున్నాడు. 14 నెలల పాటు ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా ఉండిపోయాను. నటనను వదులుకోమని చిత్రహింసలు పెట్టేవాడు,” అంటూ ఆమె తన బాధను వెల్లడించింది.

Also Read: Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 లైవ్ అప్డేట్స్

చివరకు, ఓ రోజు అతని నుంచి తప్పించుకుని పారిపోయి తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నట్లు ఆమె తెలిపింది. ఈ దారుణ అనుభవం నుంచి కోలుకోవడానికి ఆమెకు కొన్ని నెలల సమయం పట్టిందని, ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని ఆ వీడియోలో కొన్ని ఫొటోలను కూడా చూపించింది. అయితే, ఆ నిర్మాత ఎవరనేది ఆమె ఎక్కడా వెల్లడించలేదు. 1999లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆశా సైనీ, తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన *నరసింహ నాయుడు* చిత్రంలో “లక్స్‌ పాప.. లక్స్‌ పాప” అంటూ ఆమె వేసిన స్టెప్పులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ పాట తర్వాత ఆమె కెరీర్‌ ఊపందుకుంటుందని అందరూ భావించారు.

Also Read:Allu Aravind: తల్లి మరణం మరువకముందే అల్లు అరవింద్‌ను వెంటాడిన మరో విషాదం

అయితే, ఆ తర్వాత వెంకటేష్‌ నటించిన *నువ్వు నాకు నచ్చావ్‌* సినిమా మాత్రమే ఆమెకు కాస్త గుర్తింపు తెచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ చిత్రాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆశా సైనీకి ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. దీంతో ఆమె బాలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఆశా సైనీ *బిగ్ బాస్ 9*లో పాల్గొనడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ రియాలిటీ షో ఆమెకు కొత్త గుర్తింపును తెచ్చినప్పటికీ, ఆమె జీవితంలోని చీకటి అధ్యాయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆమె ధైర్యంగా తన అనుభవాలను పంచుకోవడం ద్వారా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా చేసింది.

Exit mobile version