Bigg Boss Telugu 8 Contestants Rumoured Salary: ఇప్పటికే బిగ్ బాస్ తెలుగులో ఏడు సీజన్లు పూర్తయ్యాయి. ఎనిమిదవ సీజన్ నిన్న నాగార్జున హోస్టుగా ప్రారంభమైంది. ఇక ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు పెద్దగా నోటెడ్ కాదనే కంప్లైంట్ వినిపిస్తోంది. చాలా తక్కువ మంది మాత్రమే మీడియాలో సోషల్ మీడియాలో నోటెడ్ కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే ఈ కంటెస్టెంట్లకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు? వారానికి ఎంత పే చేస్తున్నారు? అనే వివరాలు ఎప్పటిలాగే లీకయ్యాయి. ఆ వివరాలు మీకోసం. ఇక ఈ సీజన్లో అత్యధికంగా విష్ణు ప్రియ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఆమెకు వారానికి నాలుగు లక్షలు పే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆమె తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ అందుకునేది హీరోగా కొన్ని సినిమాలు చేసిన ఆదిత్య ఓం.
బిగ్ బాస్ తెలుగు 8 రెమ్యూనరేషన్లు లీక్.. అత్యధికం-అత్యల్పం ఎవరెవరికంటే?
ఆయనకు వారానికి మూడు లక్షలు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఇక వారి తర్వాత ఇద్దరికి రెండున్నర లక్షలు ఇస్తున్నారు. ఆర్జే శేఖర్ భాషతో పాటు యష్మీ గౌడకు వారానికి రెండున్నర లక్షలు పే చేస్తున్నారు. ఇక తర్వాత సీరియల్ నటుడు నిఖిల్ కి రెండు లక్షల పాతికవేలు వారానికి పే చేస్తుండగా నైనికకు రెండు లక్షల ఇరవై వేలు పే చేస్తున్నారు. ఇక తర్వాత నలుగురికి రెండు లక్షల చొప్పున పే చేస్తున్నారు. యూట్యూబర్ నబీల్ ఆఫ్రిది, ప్రేరణ, అభయ్ నవీన్, కిరాక్ సీతలకు రెండు లక్షలు వారానికి పే చేస్తున్నారు. తర్వాత సోనియా ఆకుల, బెజవాడ బేబక్క, పృథ్వీరాజ్ ముగ్గురికి వారానికి 1,50,000 చొప్పున పే చేస్తుండగా అత్యల్పంగా నాగ మణికంఠకు కేవలం 1,20,000 మాత్రమే పే చేస్తున్నారు. గతంలో ఒక బిగ్ బాస్ సీజన్ గెలుచుకున్న రివ్యూయర్ ఆదిరెడ్డి ఈ మేరకు తన వీడియో ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది.