Bigg Boss Telugu 7: రతిక, శుభ శ్రీ, దామిని రీఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ బాసూ.. యావర్ కు నాగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ ప్రస్తుతం ఆరోవారంకు చేరుకుంది.. ఈ వారం హౌస్ లోకి కొత్త వాళ్లు కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చారు.. దీంతో మళ్లీ హౌజ్ 15కి చేరింది. గౌతమ్‌ని రెండు రోజులు సీక్రెట్ రూమ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. మళ్లీ ఆయన్ని హౌజ్‌లోకి తీసుకొచ్చారు. దీంతో కొత్తవాళ్లు పోటుగాళ్లుగా, పాత వాళ్లు ఆటగాళ్లుగా నిర్ణయించి గేమ్ ఆడిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో యావర్ విజేతగా నిలిచారు. ఈ సీజన్లో బిగ్ బాస్ హౌజ్‌లో రెండో కెప్టెన్‌గా యావర్ నిలిచారు.. మొదటి రోజే మనోడికి అనుకోని షాక్ లు ఎదురయ్యాయి..
తాజాగా బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్‌కి సంబంధించి విడుదలైన ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో యావర్ కెప్టెన్ అయిన తర్వాత చాలా మార్పు వచ్చిందట. ఆ విషయాన్ని నాగ్ చెప్పారు. యాటిట్యూడ్ పెరిగింది కదా అన్నారు. ఈ మేరకు జరిగిన పరిణామాలను చూపించారు. అంతేకాదు హౌజ్‌లో రాత్రి ఇంటి సభ్యుల మధ్య జరిగిన వాదనలోనూ అదే నిరూపితమయ్యింది. అమర్, యావర్ ఫుడ్ విషయంలో చర్చిస్తున్నారు.. అమర్, యావర్ మధ్య చిన్నపాటి గొడవే జరిగింది..
Also Read
అందరు కెప్టెన్ అయిన అంతలోనే ఇంత మార్పా అంటూ గుసగుసలాడుకున్నారు. దీనిపై నాగార్జున నిలదీశాడు. వారిద్దరు మాట్లాడుకుని సాటౌట్ చేసుకుంటున్నారు. మధ్యలో నువ్వెందుకు వెళ్లావు సందీప్ ని అడిగాడు, అంతేకాదు నీ వల్ల గొడవ ఇంకా పెరిగింది అని చెప్పగా, సందీప్ వద్ద మాట లేదు. ఈ క్రమంలో యావర్‌కి వార్నింగ్ ఇచ్చాడు నాగ్. డిక్టేటర్‌గా వ్యవహరించిన ఎవరైనా తుడిచిపెట్టుకుపోయారని తెలిపారు.. ఇదిలా ఉండగా.. వరుసగా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన రతిక, శుభ శ్రీ, దామినీలు మళ్లీ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేశారు. దీంతో చెప్పాను కదా ఈ సీజన్ బిగ్ బాస్ షో మొత్తం ఉల్టా పుల్టా అని అన్నట్టుగానే ట్విస్టులు చోటు చేసుకోవడం విశేషం. అయితే వాళ్లు జస్ట్ గెస్టులుగా సందడి చేసి వెళ్లిపోతారని తెలుస్తుంది.. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి..
తాజావార్తలు
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
-
Fake Doctors: హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!