బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్స్ నిన్నటి తో పూర్తి అయ్యాయి.. ఎనిమిదో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని జనాలు తెగ ఆలోచనలో పడ్డారు.. ఈ వారం నామినేషన్స్ పూర్తి అయ్యాక బిగ్ బాస్ అందరిని నోటిని అదుపులో పెట్టుకోవాలని సీరియస్ అయ్యాడు.. 8వ వారానికి అమర్ దీప్, శివాజీ, సందీప్, శోభా, ప్రియాంక, అశ్విని, భోలే, గౌతమ్ నామినేట్ అయ్యారు. నామినేషన్స్ ముగిసిన అనంతరం బిగ్ బాస్ టాస్క్ మొదలైంది. ఇక బిగ్ బాస్ మారథాన్ పేరుతో కెప్టెన్సీ టాస్క్ మొదలుపెట్టారు. ప్రతి టాస్క్ లో గెలిచినవారు కెప్టెన్సీ కంటెండరు అవుతారు.
అయితే ఈ టాస్క్ లో అందరికంటే వెనుకబడ్డవారు కంటెండర్ రేసు నుండి తప్పుకుంటారు. మొదటి టాస్క్ లో తేజా, శోభా, ప్రియాంక, అమర్ పోటీపడ్డారు. బ్రెయిన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్, ఒక్కొక్క వస్తువును సంచాలక్ చూపిస్తూ ఉంటాడు.. అది నీటిలో మునుగుతుందా లేక తెలుతుందా అనే విషయం చెప్పాలని కొరతాడు.. అందులో ఫైవ్ స్టార్ చాకోలెట్ విత్ కవర్, విత్ అవుట్ కవర్, పుచ్చకాయ, వేరు శనక్కాయ, ప్లాస్టిక్ గ్లాస్, ఐస్, కోక్ టిన్ వంటి వస్తువులు మునుగుతాయో లేదో చెప్పాలని ఈ నలుగురిని అడిగారు.
ఈ కొత్త టాస్క్ లో అందరికంటే ఎక్కువ రైట్ సమాధానాలు చెప్పి ప్రియాంక గెలిచింది. తక్కువ సరైన సమాధానాలు చెప్పిన శోభా శెట్టి ఓడిపోయింది.. దాంతో శోభా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో శోభా శెట్టి ముఖం మాడిపోయింది. మైండ్ గేమ్ అండ్ నాలెడ్జ్ గేమ్ లో అమర్ దీప్, శోభా చేతులు ఎత్తేశారు. తేజా కొంచెం పర్లేదు అనిపించుకున్నాడు. ప్రియాంక మాత్రం ఎక్కువ సమాధానాలు చెప్పింది.. రేసులో గెలిచింది.. ఈ వారం కెప్టెన్ ఎవరో తెలియాలంటే ఈరోజు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..