తెలుగు బుల్లితెర పై సక్సెస్ ఫుల్ రేటింగ్ తో దూసుకుతున్న ఏకైక షో బిగ్ బాస్.. ఈ షోకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు అందుకే బాగా హిట్ అయ్యింది.. ఇప్పుడు ఏడో సీజన్ ముగింపుకు చేరుకుంది.. డిసెంబర్ 17న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగనుందని తెలుస్తోంది..ఈ సారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఇతనేనంటూ పలువురి పేర్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు రైతు బిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్.
ఒక కామన్ మ్యాన్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకటిగా నిలిచాడు. తనదైన ఆటతీరుతో బుల్లితెర అభిమానుల మనసులు గెల్చుకున్నాడు.. సినీ తారలు సైతం అతనికి
మద్దతుగా నిలుస్తున్నారు.. దీంతో అందరు విన్నర్ రైతు బిడ్డ అని ఫిక్స్ అయ్యారు.. సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఇతని పేరు తెగ హల్ చల్ చేస్తుంది..
ఇదిలా ఉండగా.. రైతుబిడ్డ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.. పవన్- హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ లో పల్లవి ప్రశాంత్ నటించనున్నాడని టాలీవుడ్ మీడియా సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ హరీశ్ శంకర్ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతారంట. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ గేమ్ డైరెక్టర్‌కు బాగా నచ్చేసిందట. అందుకే పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో తనకు ఒక పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట.. ఫినాలే కు గెస్ట్ గా వచ్చి హరీష్ ఈ విషయాన్ని అనౌన్స్ చెయ్యనున్నారని సమాచారం.. ఈ విషయం తెలిసి రైతు బిడ్డ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.. ఇక టైటిల్ విన్నర్ ఎవరో చూడాలి..