బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిదో వారం హీటేక్కింది.. నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది.. కానీ కెప్టెన్సీ టాస్క్ లో మాత్రం హౌస్ మేట్స్ రెచ్చిపోయారు.. ఎవ్వరు తగ్గకుండా ఈ వారం కెప్టెన్ అవ్వడం కోసం గట్టి పోటి పడ్డారు..ఫైవ్ స్టార్ చాకోలెట్ విత్ కవర్, విత్ అవుట్ కవర్, పుచ్చకాయ, వేరు శనగకాయ,ప్లాస్టిక్ గ్లాస్, ఐస్, కోక్ టిన్ వంటి వస్తువులు మునుగుతాయో లేదో చెప్పాలని ఈ నలుగురిని అడిగారు. ఈ టాస్క్ లో అందరికంటే ఎక్కువ సరైన సమాధానాలు చెప్పి ప్రియాంక గెలిచింది.
అతిగా తక్కువ సమాధానాలు చెప్పిన శోభా శెట్టి ఓడిపోయింది. దీంతో ఆమె కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.. దాంతో అమ్మడు ఏడుపు మోహం పెట్టేసింది.. రెండో టాస్క్ లో మరో నలుగురు కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. రంగుల బాక్సులను ఎత్తకుండా ఒక ఆర్డర్ లో అమర్చాలి. ఎవరు ముందుగా అమరుస్తారో వారు విన్నర్. చివరిగా అమర్చిన వాళ్ళు కంటెస్టెంట్ టాస్క్ నుండి తప్పుకుంటారు.. యావర్ పూర్తి చెయ్యగా, రతికా రేసు నుంచి బయటకు వచ్చేసింది..
అయితే హౌజ్‌లో ఎవరంటే ఎక్కువ ఇష్టం, ఎవరితో కనెక్ట్ అయ్యావని పులిహోర కలిపింది అశ్విని. దీనికి యావర్ చెబుతూ రతికతో కనెక్ట్ అయినట్టు చెప్పాడు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, దీంతో గ్యాప్ వచ్చిందని, ఇప్పుడు ఫర్వాలేదని తెలిపారు.. ఇక చూస్తుంటే అశ్వినికి లైన్ వేస్తున్నట్లు తెలుస్తుంది..మొత్తంగా చూస్తుంటే రైతుబిడ్డ ఫైనల్ విన్నర్ అవుతాడని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి ఈరోజు ఎపిసోడ్ కాస్త రసవత్తరంగా ఉండబోతుంది.. అస్సలు మిస్ అవ్వకండి..