Bigg Boss 7 Telugu : నయని పావని ఎలిమినేటెడ్.. మరో ట్విస్ట్ ఇచ్చిన నాగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ తెలుగులో సండే ఎపిసోడ్ సందడిగా మారింది.. సెలెబ్రేటి టచ్ ను తీసుకొచ్చారు బిగ్ బాస్.. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నటి శ్రీలీల బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు.. ఇక అనిల్ రావిపూడి ఒక్కొక్కరి గురించి ఫన్నీగా చెబుతూ ఆకట్టుకున్నారు. మధ్య మధ్యలో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతూ వచ్చింది. చివరికి నామినేషన్స్ లో పూజ, అశ్విని, నయని పావని మిగిలారు. అంటే ఈవారం కూడా అమ్మాయే ఎలిమినేట్ కాబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది. అదే నిజమైంది..
వీరి ముగ్గురిలో పూజా సేవ్ అయింది. దీనితో చివరికి నామినేషన్స్ లో అశ్విని, నయని పావని మిగిలారు. శ్రీలీలని పొగుడుతూ భోలే పాట పాడారు. అతడి పాటకి శ్రీలీల ఇంప్రెస్ అయింది. కాసేపు సరదాగా గడిపిన అనంతరం అనిల్ రావిపూడి, శ్రీలీల వెళ్లిపోయారు.. ఇక నాగ్ మళ్లీ నామినేషన్స్ గురించి మాట్లాడారు.. అశ్విని, నయని ముందు రెండు ఫిష్ బౌల్స్ ఉంచారు. వారిద్దరికీ రెండు బాటిల్స్ ఇచ్చారు. ఒక బాటిల్ ని ఫిష్ బౌల్ లో పోయగా ఇద్దరి ఫిష్ బౌల్స్ రెడ్ గా మారాయి. రెండవ బాటిల్ పోసిన తర్వాత అశ్విని ఫిష్ బౌల్ కలర్ మారింది. కానీ నయని ఫిష్ బౌల్ మాత్రం అలాగే రెడ్ కలర్ లో ఉండిపోయింది. దీనితో నయని ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున ప్రకటించారు..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇక నయని అందరికీ వీడ్కోలు చెప్పేసి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది..హౌస్ లో కొద్దీ రోజుల్లోనే అందరితో మంచి బాండింగ్ ఏర్పడింది అని పేర్కొంది. ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయింది. ఆమె మాటలకు హౌస్ మేట్స్ కూడా కన్నీరు పెట్టుకుని ఎమోషనల్ అయ్యారు.. ఇక నాగ్ మరో ట్విస్ట్ ఇచ్చారు..ఒక బాక్స్ తీసుకుని వచ్చి సస్పెన్స్ పెంచేసారు. ఈ బాక్స్ లో తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు హౌస్ లోకి వెళతారు అని చెప్పారు. అయితే బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి అనేది బిగ్ బాస్ ఇష్టం అని పేర్కొన్నారు. దీనితో నయని పావని నిజంగానే ఎలిమినేట్ అయిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలంటే మిస్ అవ్వకుండా బిగ్ బాస్ ను చూడాల్సిందే..
తాజావార్తలు
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు