బిగ్ బాస్ తెలుగు ఐదో వారం ఇంటి సభ్యులు చేసిన తప్పులను నాగ్ నిన్న జరిగిన ఎపిసోడ్ లో కడిగి పడేసారు.. ఈవారం మొత్తం ఆటలో వీరిద్దరి చేసినన్నీ తప్పులు ఇంకెవరూ చేయలేదంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. స్మైల్ టాస్క్ నుంచి కెప్టెన్సీ టాస్క్ రంగుపడుద్ది రాజా టాస్క్ వరకు ప్రతి దాంట్లో ఫౌల్ చేయడం.. ఆ తర్వాత మిగితా ఇంటి సభ్యుల మీదికే తిరగబడుతూ తమ తప్పును సమర్దించుకోవడం తెలిసిందే.. కొన్ని టాస్క్ లలో వాళ్లు చేసే హడావుడి పై కూడా అందరిని కోపాన్ని కలిగించాయని వివరించాడు..
ఇక ఈవారం వీరిద్దరి చేసిన తప్పులను వీడియోలతో సహా బయటపెట్టారు నాగ్. దీంతో సందీప్, అమర్ దీప్ బిక్కమొహం వేశారు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అల్లాడించేశారు నాగ్.. మనం చేస్తే తప్పు కాదు.. మిగతావాళ్లు చేస్తే తప్పు.. మన తప్పులు మనకు కనబడవా అంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. నువ్వు బెల్ కొట్టి మిగతావాళ్ల ఫౌల్స్ గురించి మాట్లాడావ్.. ఇదెక్కడి న్యాయం సందీప్ అంటూ కౌంటరిచ్చాడు నాగ్.. మొత్తానికి ఈ ఇద్దరికీ మాట రాకుండా చేశాడు..
ఐదో వారం ప్రియాంక ఎలిమినేట్ కానుందని టాక్ నడించింది. ఇప్పుడు అనుహ్యంగా ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ పేరు మారింది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ నుంచి ముగ్గురిని బయటకు పంపిస్తున్నారట. ఇప్పటివరకు డేంజర్ జోన్ లో ప్రియాంక, తేజ, శుభ శ్రీ ఉన్నారు. వీరిలో తేజ సేవ్ కాగా.. శుభ శ్రీ, ప్రియాంక ఒకేసారి ఎలిమినేట్ కానున్నారని.. అందులోనూ ప్రియాంకను పూర్తిగా ఎలిమినేట్ కాకుండా సీక్రెట్ రూంలో ఉంచారని సమాచారం.. ఇక ఈవారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కూడా కొందరు రానున్నారని సమాచారం.. వచ్చేది ఎవరో తెలియాలంటే ఈరోజు మిస్ అవ్వకుండా ఎపిసోడ్ ను చూడాల్సిందే..