బిగ్ బాస్ ఆరోవారం కెప్టెన్సీ కోసం ఇంటి సభ్యులు రెచ్చిపోయారు.. ఇక బిగ్ బాస్ కూడా రెండు టీమ్ లుగా చేసి వింత టాస్క్ లను ఇస్తున్నారు.. తాజాగా విడుదలైన ప్రోమోలో శోభా పై రివేంజ్ తీర్చుకున్నాడు యావర్. అంతకు ముందు వీక్ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేయాలంటే నువ్వు నన్ను తప్పించావ్ అంటూ రీజన్ చెప్పేశాడు. ఇంకేముంది ఒక్కసారిగా శోభాను మోనితా ఆవహించేసింది. చప్పట్లు కొడుతూ.. ఏడుస్తూ నానా హంగామా సృష్టించింది.. ఒక్కమాటలో చెప్పాలంటే కార్తీక దీపం సీరియల్ చూపించింది..
ప్రోమో ను చూస్తే.. కెప్టెన్సీ కంటెండర్స్ తమకు ఇచ్చిన బల్బ్ లను ధరించి మిగతా ఇంటి సభ్యుల మద్దతు కోసం ప్రయత్నిస్తూ తమ బలూన్ కాపాడుకోవాలని సూచించాడు బిగ్బాస్. అయితే ఈ టాస్క్ కేవలం ఆటగాళ్లకు మాత్రమే ఉన్నట్లుగా ప్రోమో చూస్తే తెలుస్తోంది.. ఇందులో ముందుగా సందీప్ మాస్టర్ శివాజీ బలూన్ పగలగొడుతూ అర్థం చేసుకోండి అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆటలో అంతగా పర్ఫామెన్స్ కనిపించలేదంటూ ప్రియాంక బలూన్ పగలగొట్టేశాడు పల్లవి ప్రశాంత్. దీంతో గేమ్ మాత్రమే కాదన్నది ప్రియాంక. ఇక ఆ తర్వాత ప్రశాంత్ సైతం గేమ్ నుంచి తప్పుకున్నాడు..
ఆ తర్వాత సందీప్ బలూన్ ను కాపాడుకొని ఆరు వారాలు సేఫ్ అయ్యాడు…శోభా పై యావర్ రివేంజ్ తీర్చుకున్నాడు..జనాల దృష్టిలో హీరో అయ్యేందుకు తీసుకుంటావో నీ ఇష్టం అన్నాడు. ఇక పక్కనే కూర్చున్న శోభా.. పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించింది. చప్పట్లు కొడుతూ.. ఆడు ఆడు అంటూ పరొక్షంగా యావర్ ను తప్పించు అంటూ హింట్ ఇచ్చింది.. ఇక చివరగా తేజ, యావర్, అమర్ దీప్ ముగ్గురు మిగిలారు. దీంతో చాలా తెలివిగా అర్జున్ అంబటి తేజను సెలక్ట్ చేస్తూ.. మిగతా ఇద్దరిలో ఎవరిని తప్పించాలో చాన్స్ ఇచ్చాడు. ఇప్పటివరకు జరిగినవన్ని గుర్తుపెట్టుకుని నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు తీసుకుంటావో.. లేదా జనాల దృష్టిలో హీరో అయ్యేందుకు తీసుకుంటావో నీ ఇష్టం అన్నాడు. ఇక పక్కనే కూర్చున్న శోభా.. పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించింది… మొత్తానికి ఈ రెండో కెప్టెన్ గా యావర్ గెలిచినట్లు ప్రోమోను చూస్తే తెలుస్తుంది..