బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు జనాల అంచనాలను రెట్టింపు చేస్తుంది.. గత సీజన్ భారీగా ఫెయిల్ అవ్వడంతో నిర్వాహకులు గట్టిగానే ఈ షోను ప్లాన్ చేశారు.. దాంతో సక్సెస్ అయ్యింది.. ప్రతి ఎపిసోడ్ లో ఏదోక ట్విస్ట్.. దాంతో రేటింగ్ కూడా భారీగానే పెరిగింది.. షో విజయం సాధించడంతో మేకర్స్ తో పాటు హోస్ట్ నాగార్జున ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గత సీజన్లో నాగార్జున విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన హోస్టింగ్ లో పస తగ్గిందనే వాదన వినిపించింది. సీజన్ 7కి హోస్ట్ ని మారుస్తున్నారు. నాగార్జున తప్పుకున్నారంటూ ఆ మధ్య వార్తలు కూడా వినిపించాయి..
అయితే స్టార్ మా నాగార్జున మీద నమ్మకం ఉంచి అతన్నే నియమించింది.. ఈ సీజన్ మరో మూడు రోజుల్లో ముగింపుకు చేరుతుంది.. గ్రాండ్ గా గ్రాండ్ ఫినాలే ను నిర్వాహకులు నిర్వహించనున్నారు.. ఇద్దరు బడా స్టార్స్ ని గెస్ట్స్ గా తీసుకొస్తున్నారని లేటెస్ట్ న్యూస్. వారిలో ఒకరు మహేష్ బాబు కాగా, మరొకరు నందమూరి బాలకృష్ణ అంటున్నారు. నాగ్ కు బాలయ్యకు పెద్దగా మాటల్లేవు.. అయిన బాలయ్య వస్తారన్న వార్త హల్ చల్ చేస్తుంది..
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా బాలకృష్ణ వస్తున్నాడని టాక్.. నాగార్జున స్వయంగా ఆయన్ని ఆహ్వానించాడట. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా.. ఈ ఇద్దరు సీనియర్ హీరోలతో బిగ్ బాస్ వేదిక పంచుకుంటారట. ఎటూ గుంటూరు కారం విడుదల సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం కూడా మహేష్ బాబు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వస్తారని వార్త గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతుంది.. ఇక టైటిల్ పోరు ప్రశాంత్, శివాజీ, అమర్ మధ్య జరగనుంది. మెజారిటీ ఆడియన్స్ వీరిలో ఒకరు విన్నర్ అవుతారని కామెంట్స్ చేస్తున్నారు.. మరి ఎవరు అవుతారో చూడాలి..