Maha Shivaratri 2025: ప్రపంచంలోనే ఎత్తైన రుద్రాక్ష శివలింగం.. 36 లక్షల రుద్రాక్షలతో.. 36 అడుగుల శివలింగం
- ప్రపంచంలోనే ఎత్తైన రుద్రాక్ష శివలింగం
- 36 లక్షల రుద్రాక్షలతో.. 36 అడుగుల శివలింగం
- ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా శివరాత్రి ఉత్సవాలకు భక్తులు సిద్ధమవుతున్నారు. పరమ శివున్ని ప్రసన్నం చేసుకునేందుకు శివయ్య భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే శివాలయాలను పూలు, మామిడాకుల తోరణాలతో ముస్తాబు చేస్తున్నారు. మహా శివరాత్రి వేళ శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగనున్నాయి. భక్తులు ఉపవాసాలు, జాగారాలతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు శివయ్యపై తమ భక్తిని వినూత్నరీతిలో చాటుకుంటున్నారు. ఇదే రీతిలో గుజరాత్ లోని భక్తులు శివలింగాన్ని రుద్రాక్షలతో రూపొందించారు. వందలు,వేలు కాదు ఏకంగా 36 లక్షల రుద్రాక్షలతో 36 అడుగుల ఎత్తైన శివలింగాన్ని తయారు చేశారు.
Also Read:UN on Ukraine: రష్యాకు మద్దతుగా అమెరికా ఓటింగ్, భారత్ గైర్హాజరు.. యూఎన్‌లో సంచలనం..
Also Read
- Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
- Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
- Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారం, ఉద్యోగంలో అనుకూలతలు!
గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని దుల్సాద్ గ్రామంలో ప్రపంచంలోనే ఎత్తైన రుద్రాక్ష శివలింగాన్ని ఆవిష్కరించారు. రుద్రాక్ష నిపుణుడు బటుక్భాయ్ వ్యాస్ ప్రేరణతో, ఈ శివలింగం 36 లక్షల రుద్రాక్షలతో తయారు చేయబడింది. 36 అడుగుల ఎత్తైన శివలింగం ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. రుద్రాక్ష శివలింగాన్ని రూపొందించడానికి 56 మంది 78 రోజుల పాటు శ్రమించినట్లు సమాచారం. ఇది ఇప్పుడు భక్తులకు ప్రధాన ఆకర్షణ కేంద్రంగా మారింది.
Also Read:DK Aruna : దేశంలో మోడీ పాలన బాగుందని ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు
హిందూ విశ్వాసాల ప్రకారం, రుద్రాక్షలు శివుని కన్నీళ్ల నుండి ఉద్భవించాయని నమ్ముతారు. రుద్రాక్షతో చేసిన శివలింగాన్ని అభిషేకించడం ద్వారా పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. రుద్రాక్షను శివుని చిహ్నంగా భావిస్తారు. పూజలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ భారీ రుద్రాక్ష శివలింగాన్ని చూడటానికి వేలాది మంది భక్తులు దుల్సాద్ గ్రామానికి చేరుకుంటున్నారు. రుద్రాక్ష శివలింగానికి ప్రత్యేక పూజలు చేస్తూ తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!