NTV Telugu Site icon

Maha Shivaratri 2025: ప్రపంచంలోనే ఎత్తైన రుద్రాక్ష శివలింగం.. 36 లక్షల రుద్రాక్షలతో.. 36 అడుగుల శివలింగం

Siva Lingam

Siva Lingam

మహా శివరాత్రి ఉత్సవాలకు భక్తులు సిద్ధమవుతున్నారు. పరమ శివున్ని ప్రసన్నం చేసుకునేందుకు శివయ్య భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే శివాలయాలను పూలు, మామిడాకుల తోరణాలతో ముస్తాబు చేస్తున్నారు. మహా శివరాత్రి వేళ శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగనున్నాయి. భక్తులు ఉపవాసాలు, జాగారాలతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు శివయ్యపై తమ భక్తిని వినూత్నరీతిలో చాటుకుంటున్నారు. ఇదే రీతిలో గుజరాత్ లోని భక్తులు శివలింగాన్ని రుద్రాక్షలతో రూపొందించారు. వందలు,వేలు కాదు ఏకంగా 36 లక్షల రుద్రాక్షలతో 36 అడుగుల ఎత్తైన శివలింగాన్ని తయారు చేశారు.

Also Read:UN on Ukraine: రష్యాకు మద్దతుగా అమెరికా ఓటింగ్, భారత్ గైర్హాజరు.. యూఎన్‌లో సంచలనం..

గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని దుల్సాద్ గ్రామంలో ప్రపంచంలోనే ఎత్తైన రుద్రాక్ష శివలింగాన్ని ఆవిష్కరించారు. రుద్రాక్ష నిపుణుడు బటుక్‌భాయ్ వ్యాస్ ప్రేరణతో, ఈ శివలింగం 36 లక్షల రుద్రాక్షలతో తయారు చేయబడింది. 36 అడుగుల ఎత్తైన శివలింగం ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. రుద్రాక్ష శివలింగాన్ని రూపొందించడానికి 56 మంది 78 రోజుల పాటు శ్రమించినట్లు సమాచారం. ఇది ఇప్పుడు భక్తులకు ప్రధాన ఆకర్షణ కేంద్రంగా మారింది.

Also Read:DK Aruna : దేశంలో మోడీ పాలన బాగుందని ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు

హిందూ విశ్వాసాల ప్రకారం, రుద్రాక్షలు శివుని కన్నీళ్ల నుండి ఉద్భవించాయని నమ్ముతారు. రుద్రాక్షతో చేసిన శివలింగాన్ని అభిషేకించడం ద్వారా పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. రుద్రాక్షను శివుని చిహ్నంగా భావిస్తారు. పూజలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ భారీ రుద్రాక్ష శివలింగాన్ని చూడటానికి వేలాది మంది భక్తులు దుల్సాద్ గ్రామానికి చేరుకుంటున్నారు. రుద్రాక్ష శివలింగానికి ప్రత్యేక పూజలు చేస్తూ తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు.