NTV Telugu Site icon

Bathukamma Festival Secret: బతుకమ్మ పండుగ జరుపుకోవడం వెనుక రహస్యం..?

Bathukamma Festival Secret

Bathukamma Festival Secret

Bathukamma Festival Secret: తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే ప్రకృతిని దేవతగా భావించి ఆరాధించే సాంప్రదాయం కనిపిస్తుంది. విజయ దశమికి 10 రోజుల ముందు నుండి తెలంగాణా ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ వర్షాకాలంలో వస్తుంది. పరుచుకున్న పచ్చదనంలో, హాయిగొలిపే పువ్వుల నవ్వుల్లో, జారే జలపాతపు సడిలో, పారే సెలయేటి హొయల్లో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. ఆ అందమైన ప్రకృతిని చూసిన వాళ్ళ మనసు పరవశిస్తుంది. అలాంటి ఈ సమయంలో దొరికే రకరకాల పువ్వుల్ని ఓ చోట పేర్చి మహిలు అందరూ ఓ చోట చేరి పాటలు పాడి నీటిలో నిమర్జనం చేస్తారు. ఆలా మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాడే పాటలు వినడానికి వినసొంపుగా.. చూడడానికి కనుల విందుగా ఉంటుంది. అయితే ఈ పండుగ జరుపుకోవడం వెనుక ఓ కథ ఉంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

పండుగ వెనుక రహస్య కథ..

ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని పూర్వం తైలపాడు అనే రాజు పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు చాళుక్య రాజ్యాన్ని పరిపాలించిన రాజరాజ చోళా కుమారుడు రాజేంద్రచోళ సత్యాస్రాయపై యుద్ధం చేసి విజయం సాధించాడు. అతను సాధించిన యుద్దానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. దీనికి కారణం తెలంగాణా ప్రజలు రాజేశ్వరి ఆలయంలోని అమ్మవారిని ఘాడంగా విశ్వసించేవారు. అయితే రాజేంద్రచోళ తండ్రి అయినటు వంటి రాజరాజ చోళా కూడా అమ్మవారి భక్తుడిగా మారాడు.

Read also: Rajendra Prasad : సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.

ఈ కారణం చేత యుద్ధంలో విజయం సాధించిన రాజేంద్రచోళ ఆలయాన్ని కూల్చేసి అందులోని శివలింగాన్ని తన తండ్రికి బహూకరించాడు. ఈ విషయం తమిళ శిలాశాసనాల్లో లిఖించబడింది. అయితే వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తీసుకుపోవడంతో తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. దీనితో వాళ్లకు కలిగిన వర్ణనాతీత వేదనను చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా బతుకమ్మ పండుగ మొదలయింది. ఇప్పటికి తెలంగాణా ప్రజలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. పెళ్ళైన మహిళలు ఈ పండుగకు పుట్టింటికి వచ్చి బతుకమ్మను పేర్చి 9 రోజులు ఈ పండుగను జరుపుకుంటారు.
Nagarjuna: “నా ఫ్యామిలీని కాపాడుకునే విషయంలో నేను సింహం”.. నాగార్జున సంచలన పోస్ట్