Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవగ్రహాల కదలికలు, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి మంగళవారం (జూలై 28) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఏ దైవ శ్లోకాలు పారాయణం చేయాలో తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 28 జూలై 2026 నాటి దినఫలాలు అందించారు.
మకర రాశి వారికి ఈరోజు ఎంతో అనుకూలమైన రోజు. ఉద్యోగ రంగంలో మంచి ఉన్నతిని సాధిస్తారు. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారుల నుండి లభించే ప్రశంసలు ఆనందాన్ని ఇస్తాయి. లలితా అమ్మవారిని ఆరాధిస్తూ లలితా పంచరత్న స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. కుంభ రాశి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో ఉన్న సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కుటుంబ అనుకూలతలు ఉంటాయి. వివిధ రకాల ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. హనుమత్ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఆంజనేయ స్వామికి సిందూరం సమర్పించడం శ్రేయస్కరం.
Also Read
మేష రాశి వారికి ఆర్థిక విషయాలలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు మంచి ఉన్నతిని సాధించుకోగలుగుతారు. మనసుకు సంతోషాన్నిచ్చే శుభవార్తలు అందుతాయి. వీరు శ్రీ విఘ్నేశ్వర స్వామిని స్మరిస్తూ అష్టవినాయక స్తోత్రాన్ని పారాయణం చేయడం శుభప్రదం. వృషభ రాశి వారు ఈరోజు పెద్దలను కలుసుకోవాల్సిన అవసరాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కష్టపడి పనిచేసి మంచి విజయాలను సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో వచ్చే మిశ్రమ ఫలితాలను అధిగమిస్తారు. వీరు శ్రీ అయ్యప్ప స్వామికి కర్పూర నీరాజనం సమర్పించడం మేలు చేస్తుంది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.
తాజావార్తలు
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Virat Kohli Anushka: లండన్‌లో ఉన్నా భారత్‌లో పెట్టుబడులు.. మరో లగ్జరీ ఇల్లు సొంతం చేసుకున్న విరాట్, అనుష్క
-
Justin Greaves: టెస్ట్ చరిత్రలో అరుదైన రికార్డు.. ఒక్క పరుగు ఇవ్వకుండా 5 వికెట్లు నేలకూల్చిన వెస్టిండీస్ పేసర్.!
-
Sharmila Dhankhar: పోలియోను జయించి చరిత్ర సృష్టించిన షర్మిలా ధన్ఖర్.. పారా షాట్‌పుట్‌లో స్వర్ణం
-
Pavala Shyamala: టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత..!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!