Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!

Sunday Astrology

Sunday Astrology

Sunday Astrology October 18 2026: మిథున రాశి వారు వివిధ రూపాల్లో వ్యాపార ప్రయత్నాలు ప్రారంభించి మంచి ప్రతిస్పందన పొందుతారు. డబ్బు రాక అధికం అవుతుంది. రాజకీయ సమావేశాలలో పాల్గొని, నాయకులతో కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. చండీ అమ్మవారి అనుగ్రహం కోసం దుర్గాదేవికి కుంకుమార్చన చేసి పాయసం నివేదించాలి. కన్యా రాశి వారికి పెండింగ్ వ్యవహారాలు, ప్రయోజనాలలో కొంతమేర సఫలత లభిస్తుంది. చిన్న వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. నవదుర్గా స్తోత్రం పారాయణం చేయడం మంచిది.

కుంభ రాశి వారికి సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి అనుకూలతలు ఏర్పడతాయి. దూర ప్రాంతాలతో వ్యాపార చర్చలు కొనసాగిస్తారు. బాకీలు వసూలవడంతో పాటు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మిత్రులతో కలిసి నూతన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇంద్రాణి అమ్మవారిని ఆరాధించి దుర్గా కవచం పారాయణం చేయాలి. మీన రాశి వారికి విద్యాపరమైన అంశాలలో మంచి పురోగతి ఉంటుంది. దూర ప్రాంత ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వల్ల పెట్టుబడులు లాభిస్తాయి. మహాదుర్గా అమ్మవారిని పూజించి, దుర్గా సప్తశీ పారాయణం చేసి పేదవారికి అన్నదానం చేయాలి. ప్రముఖ జోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ఆదివారం (అక్టోబర్ 18, 2026) దిన ఫలాలు అందించారు.